Monday, April 21, 2025

జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ నేత తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించడంతో మరణించారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు సంతాపాన్ని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com