Monday, November 18, 2024

38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సు

కాలేజీల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
డిగ్రీతో పాటు సరికొత్తగా నైపుణ్య డిగ్రీ
18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న
10 వేల మంది విద్యార్థులకు బిఎఫ్‌ఎస్‌ఐ శిక్షణ
నేడు సిఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్యూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగా దేశంలోనే వినూత్న ప్రయోగానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బిఎఫ్‌ఎస్‌ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన (నేడు) ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దీనిని ఆవిష్కరించనున్నారు. ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు శిక్షణను అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు జరిగేలా ఈ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న బిఎఫ్‌ఎస్‌ఐ సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతోంది. అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించాలని ప్రభుత్వం లక్షంతో ముందుకుపోతోంది. ఈ కార్యక్ర మంలో భాగంగా శిక్షణను అందుకుంటున్న 10 వేల మంది విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందిస్తోంది.

వీడియో కాల్ ద్వారా విద్యార్థులను నేరుగా ఇంటర్వ్యూ
విద్యార్థుల బయోడేటాతో పాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం వివరాలను అక్కడ పొందుపరు చనున్నారు. బిఎఫ్‌ఎస్‌ఐ రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పని చేయనుంది. బిఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు ఈ పోర్టల్‌లో ఉన్న విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసే వీలుంటుంది. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ భరోసాను ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సహకారంతో బిఎఫ్‌ఎస్‌ఐ కన్సార్టియం మినీ డిగ్రీ కోర్సుకు అవసరమైన సిలబస్‌ను రూపొందించింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం లేకుండా సిఎస్‌ఆర్ నిధులను సమీకరించి మూడేళ్ల పాటు ఈ శిక్షణను అందించేలా మంత్రి శ్రీధర్ బాబు బిఎఫ్‌ఎస్‌ఐ సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఎక్విఫ్ అనే సంస్థ ఈ కార్యక్రమానికి రూ.2.50 కోట్లు అందించేందుకు ముందుకు వచ్చింది. విద్యార్థులకు ఉపాధి కల్పించేలా జీసిసిలకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఉండటంతో పాటు సిఎస్‌ఆర్ నిధులను సమీకరించనుంది.
ఈ కోర్సుకు ఎంపిక చేసిన కాలేజీల (నాన్‌ఇంజనీరింగ్ 20 కాలేజీలు) వివరాలు ఇలా…
పింగళి ప్రభుత్వ మహిళా కాలేజీ, వడ్డేపల్లి, హన్మకొండ

ఎస్‌ఆర్ అండ్ బిజిఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ, ఖమ్మం
నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్గొండ
ఆంధ్ర మహిళా సభ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ, హైదరాబాద్
భవన్ డిగ్రీ, పిజి కాలేజీ, హైదరాబాద్
ప్రభుత్వ సిటీ కాలేజీ, హైదరాబాద్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సిద్దిపేట
ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, బేగంపేట
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్
ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ, నాంపల్లి
నిజాం కాలేజీ, హైదరాబాద్
ఆర్‌బివిఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీ, హైదరాబాద్
సెయింట్ అన్స్ మహిళా డిగ్రీ కాలేజీ, మెహిదీపట్నం
సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా డిగ్రీ కాలేజీ, హైదరాబాద్
సెయింట్ పియస్ ఎక్స్ మహిళా డిగ్రీ కాలేజీ, నాచారం
తారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, సంగారెడ్డి
ఎంవిఎస్ ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ, మహబూబ్‌నగర్
ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోఠి
గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నిజామాబాద్
ఇంజనీరింగ్ కాలేజీలు 18

1. బివిఆర్‌ఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్‌టీయూ హెచ్) 2. జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (జేఎన్‌టీయూహెచ్) 3. గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ (జేఎన్‌టీయూహెచ్) 4. జె.బి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ (జేఎన్‌టీయూ హెచ్) 5. జేఎన్‌టీయూ కూకట్‌పల్లి ప్రధాన క్యాంపస్ (జేఎన్‌టీయూ హెచ్) 6. కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్‌టీయూ హెచ్) 7. మహాత్మాగాంధీ జేఎన్‌టీయూ ఆఫ్ టెక్నాలజీ (జేఎన్‌టీయూ హెచ్) 8. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్‌టీయూ హెచ్)

9. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (జేఎన్‌టీయూ హెచ్) 10. కిట్స్ వరంగల్ (కేయూ) 11. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఓయూ) 12. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) 13. మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) 14. మెథడిస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ (ఓయూ) 15. ఉస్మానియా విశ్వవిద్యా లయం ఇంజనీరింగ్ కాలేజీ (ఓయూ) 16. స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ (ఓయూ) 17. ఆర్జీయుకేటీ బాసర (ఆర్జీయు కేటీ) 18. బివి రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్ (జేఎన్‌టీయూ హెచ్)లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular