జీహెచ్ఎంసి అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్ రాసలీలల వ్యవహారం బయటపడింది. వేరే మహిళతో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణి ఈ సందర్భంగా తెలిపారు. శుక్రవారం వేరే మహిళతో ఉండగా అతని భార్య కళ్యాణి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జానకిరామ్ తన కంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి పట్టుకొని ఇద్దరినీ చితకబాదింది. కుటుంబాన్ని వదిలేసి గత కొద్ది రోజులుగా జానకిరామ్ వారాసిగూడలో ఆ అమ్మాయితో ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళుతున్నాడని భార్య కళ్యాణి నిఘా పెట్టారు. సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్టుమెంట్‌లో ఉన్న ఇద్దరిని కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కాగా జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణి తెలిపారు. గొడవ జరుగుతున్న సమయంలో ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో వారాసిగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.