Friday, December 27, 2024

అనిశ్చిత వాతావరణంలో జర్నలిస్టులు

భారతదేశంలోని జర్నలిస్టులు ఒక అనిశ్చిత వాతావరణంలో ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నారు. తరచుగా జర్నలిస్టులు భద్రతా పరమైన ముప్పును ఎదుర్కొంటున్నారు “ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇనిషియేటివ్” సమన్వయకర్త సుహాస్ చక్మా తన వార్షిక నివేదిక లో సభ్య సమాజం విస్తుపోయే వివరాలను తెలియ చేసారు. వారు తన నివేదికలో పొందుపరిచిన వివరాలను పరిశీలిస్తే..

2015లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల్లో 76% మంది హత్యలకు గురైనారు.

ఇందులో వృత్తిపరంగా వివిధ సందర్భాల లో సంచలన సమాచారాన్ని బయ్యట పెట్టినందుకు రాజకీయ పరమైన పగ ప్రతీకారాలు తో హత్య లకు గురైనవారి లో జర్నలిస్ట్ లే అధికులు అని ఒక అధ్యయనం వెల్లడించింది.

ఈ నివేదిక జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న ప్రమాదాల తీవ్రతను సూచిస్తుంది. ‘

ఈ జర్నలిస్ట్ హత్యలలో 56% హత్యలు పేరువున్న రాజకీయ పక్షాల నాయకులు సామాజిక సమూహాలు పాల్పడ్డాయి. 7% హత్యలు వివిధ నేర ముఠాలు చేశాయి ఆని గణాంకాలు చెపుతున్నాయి.

జర్నలిస్ట్ ల పై జరిగిన దాడుల గత చరిత్ర ఇలా వుంటే…

వర్తమానంలో జర్నలిస్టు లపై జరిగిన దాడులు జరిగిన హత్యల కు సంబందించి నమోదైన గణాంకాలు పరిశీలిస్తే….

పాత్రికేయులు ఎంత ప్రాణాంతక పరిస్థితులలో పనిచేస్తున్నారో సమాజానికి అర్ధం అవుతుంది

2024 లోజర్నలిస్టులపై దాడులు విప‌రీతంగా పెరిగాయి. వృత్తి నిర్వహణలో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే 2023లో ఐదుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా 226 మందిపై ప్రభుత్వ సంస్థలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు, నేరస్తులు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వివిధరకాలుగా ఇబ్బందుల కు గురి చేశారు.

చంపబడిన జర్నలిస్టుల వివరాలు రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, అస్సాం, మహారాష్ట్ర, బీహార్‌లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 54 మంది జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్(25), మణిపూర్(22), యూపీ(20), కేరళ(16), జార్ఖండ్(11), మహారాష్ట్ర, తెలంగాణ8 చొప్పున హత్యలు ,దాడులు జరిగాయి

అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్(7 చొప్పున), ఛత్తీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్, కర్ణాటక, ఓడిశా(5 చొప్పున), ఏపీ, హర్యానా(4 చొప్పున), పంజాబ్(3), త్రిపుర(2), తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్(ఒక్కరు చొప్పున) దాడులకు హత్యలకు గురి అయ్యారు.

ఇక దేశవ్యాప్తంగా 30 మంది మహిళా జర్నలిస్టులు అనేక వ్యవహారాల్లో టార్గెట్ చేయబడుతున్నారని నివేదిక తెలిపింది.

ఢిల్లీలో అత్యధికంగా 12 మంది, కేరళ, మణిపూర్(5 మంది చొప్పున), పశ్చిమ బెంగాల్(3), పంజాబ్(2), ఒడిశా, తెలంగాణ, యూపీ(ఒక్కరు చొప్పున) మహిళా జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వీరిలో ముగ్గురు అరెస్ట్ లేదా నిర్భంధానికి గురికాగా, తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇంకా కొందరిపై వ్యక్తిగతంగా దాడి చేయడం, ఇళ్లపై దాడులు వంటి సంఘటనలు కూడా ఉన్నాయని నివేదిక తెలిపింది.

‘భారత్‌లో సామాజిక ప్రయోజనం కోసం సత్యనిష్ట తో పాత్రికేయ వృత్తిని అవలంబించే వారి

ప్రాణాలకు భద్రత కరువైంది

సమాజం లోని రాజకీయ సామాజిక వ్యాపార వర్గాల నుండే కాక అధికార వర్గం నుండి కుడా అత్యంత ప్రాణాంతక క్రూర దాడులకు నిత్యం గురి అవుతూ జర్నలిజం దేశంలోఅత్యంత ప్రమాదకరమైన వృత్తిగా మారింది” అన్నారు.

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లా వ్యవహరించే పత్రికా టివి వ్యవస్థ పై జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యానికి నియంతృత్వ వ్యవస్థ నుండి ఎదురైనా మొదటి హెచ్చరిక లా ‘ వుంది ఆనిఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇనిషియేటివ్ సమన్వయకర్త సుహాస్ చక్మా ఒక నివేదిక లో విమర్శించారు.

ఎడిటర్స్ గిల్డ్ నివేదికల ప్రకారం

జనవరి 5, 2024: ప్రభాత్ ఖబర్ చీఫ్ ఎడిటర్ మిస్టర్ అశుతోష్ చతుర్వేదిపై జార్ఖండ్ పోలీసులు IPC సెక్షన్లు 469, 501, మరియు 502 కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) నమోదు చేశారన్న వార్తలను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది

రెసిడెంట్ ఎడిటర్ శ్రీ విజయ్ కాంత్ పాఠక్, అలాగే MD, Mr. రాజీవ్ ఝవార్, మిస్టర్ జోగేంద్ర తివారీ దాఖలు చేసిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా.

డిసెంబర్ 29, 2023: 24 న్యూస్ అనే టెలివిజన్ ఛానల్ రిపోర్టర్‌పై విద్యార్థుల నిరసనకు సంబంధించి కేరళ పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయడం పైఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది

ఫిబ్రవరి 10, 2024: శుక్రవారం పూణె నగరంలో సీనియర్ జర్నలిస్ట్ మిస్టర్ నిఖిల్ వాగ్లేపై జరిగిన దాడిని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది.

ఫిబ్రవరి 22, 2024: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఒక టీవీ జర్నలిస్టుపై పార్టీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా భౌతిక దాడికి పాల్పడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన సంఘటనపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.

ఫిబ్రవరి 20, 2024: పశ్చిమ బెంగాల్‌లోని సందేస్‌ఖాలీ నుండి రిపబ్లిక్ బంగ్లా టివి ఛానల్ పనిచేస్తున్న టీవీ జర్నలిస్ట్‌ని సోమవారం అరెస్టు చేయడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.

సున్నితమైన రాజకీయ అంశాలు మరియు నేర కార్యకలాపాలపై నివేదించడం వల్ల జర్నలిస్ట్ లు ఎదుర్కొనే ప్రమాదాలను పై సంఘటనలు తెలియ చేస్తున్నాయి.

భారతీయ జర్నలిస్టులు ఎంత ప్రమాద కర పరిస్థితులలో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారో పై ఘటనలు నొక్కి చెబుతున్నాయి

, ముఖ్యంగా అవినీతి, నేరాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనలపై నివేదించే సమాచారం వారిని మరిన్ని ప్రమాద కర పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి.

వాస్తవ పరిస్థితులు ఇలా వుండగా

తెలంగాణా లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లి ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి 2006-2008 మధ్య జర్నలిస్ట్ గృహ వసతి కోసం కేటాయించిన 72 ఎకరాలకు సంబందించి తుది తీర్పులో

“రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగు స్తంభాలు గా నిలిచే శాసన ,కార్యనిర్వహక ,న్యాయ, మీడియా వ్యవస్థలు కలిసి స్వప్రయోజనాల రక్షణ లో భాగంగా విలువైన ప్రభుత్వ ఆస్తులను స్వంతం చేసుకోవాలి ఆని కుట్ర చేసారు.

జర్నలిస్టులు తమ తమ వృత్తిపరమైన బాధ్యతల నుండి తప్ప్పుకోవటానికి లేదా సమాజంలో జరిగే తప్పులను కప్పిపుచ్చుడానికి సిద్దం అయ్యారు.

ప్రజాస్వామ్యానికి మూడు స్తంభాల వంటి వ్యవస్థలలో జరిగే తప్పులకి అనుకూలంగా ఉన్నారని “జస్టిస్ ఖన్నా తన యొక్క పరిశీలన గా చెప్పుకొచ్చారు.

కానీ పై ఘటనలు పరిశీలించి చూస్తే జస్టిస్ ఖన్నా పరిశీలనకు పూర్తి విరుద్ధంగా వాస్తవ పరిస్థితులు వున్నాయి

కాబట్టి దయచేసి గౌరవ సుప్రీం కోర్టు వారు సమాజంలో పాత్రికేయుల వాస్తవ స్థితిగతులను దృష్టి లో పెట్టుకుని మానవీయ దృష్టి లో పెట్టుకుని..ఆర్టికల్ 15 (4)

ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రత్యేక సమూహంగా గుర్తించి మా హక్కులను పరిరక్షిస్తూ..

మా జీవన స్థితి గతులను మెరుగు పరిచేందుకు అవసరమైన కనీస అవసరాలు ఆయిన గృహవసతి కల్పించేందుకు ప్రభుత్వాలకు అవకాశాలు కల్పిస్తూ జస్టిస్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ భట్ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పున పరిశీలించి …పాత్రికేయ సమాజానికి తగు న్యాయం చెయ్యాలని ప్రార్ధిస్తున్నాం!!

2015లో జగేంద్ర సింగ్ మరణం

2015 నుండి జర్నలిస్ట్ లపై జరిగిన హత్యా ప్రయత్నాలలో మొదటిది జగేంద్ర సింగ్ పై అనబడే వ్యక్తి పై జరిగింది. , ఇతను ఒక జర్నలిస్ట్ ఫ్రీలాన్సర్, జూన్ 2015లో పోలీసులు చేసిన క్రూర దాడిలో తీవ్రమైన కాలిన గాయాలతో మరణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించిన అక్రమ ఇసుక తవ్వకాల కేసుపై ఆయన పనిచేస్తున్నారు .

2016లో ఉత్తరప్రదేశ్‌లో జనసందేశ్ టైమ్స్ రిపోర్టర్ కరుణ్ మిశ్రా , ఈశాన్య రాష్ట్రమైన బీహార్‌లో హిందుస్థాన్ రిపోర్టర్ రంజన్ రాజ్‌దేవ్ హత్యకు గురయ్యారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై వారి పని ఫలితంగా మోటార్‌సైకిళ్లపై వచ్చిన అగంతకులు ఈ ఇద్దరూ జర్నలిస్ట్ లను కాల్చి చంపారు .

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని న్యూస్ వరల్డ్ లోకల్ టీవీ ఛానెల్ కోసం ఇసుక మాఫియా సమాచారాన్ని కవర్ చేస్తున్న సందీప్ శర్మ అనే రిపోర్టర్, ను 2018 మార్చిలో ఉద్దేశపూర్వకంగా అతనిని తన వాహనం నుండి బలవంతంగా కిందకి దింపి డంపర్-ట్రక్కుతో గుద్ది హత్య చేశారు.

కాంపు మెయిల్ స్థానిక వార్తాపత్రిక లో రిపోర్టర్ గా పని చేస్తున్న శుభం మణి త్రిపాఠి 2020 జూన్‌లో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇసుక మాఫియా అక్రమ దోపిడీ కేసులపై పరిశోధనాత్మక కథనాలు ప్రచురించి నందునతనను లక్ష్యంగా చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన అతి కొద్ది కాలంలో కాల్చి చంపబడ్డాడు .

ఇసుక మాఫియాపై సంచలన కథనాలు ను ప్రచురించిన ఫ్రీలాన్స్ రిపోర్టర్ సుభాష్ కుమార్ మహ్తోను మే 2022లో బీహార్‌లోని తన ఇంటి వెలుపల నలుగురు గుర్తుతెలియని హంతకులు తలపై కాల్చి చంపారు.

6 ఫిబ్రవరి 2023 అక్రమ భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ లాబీయిస్ట్ అక్రమాలను వెలికి తీసిన పుణ్యానికి పరిశోధనాత్మక పాత్రికేయుడు శశికాంత్ వారిషే నీ నడి రోడ్డులో జరిగిన దాడిలో తగిలినగాయాలతో మరణించారు.

2014 నుండి జర్నలిజంకు సంబంధించి హత్యకు గురి కాబడిన వారిలో మరో 15 మంది జర్నలిస్టులు అవినీతి, వ్యవస్థీకృత నేరాలు, ఎన్నికలు మరియు మావోయిస్టుల తిరుగుబాటుకు సంబంధించిన కథనాలను రూపొందించినందుకు రాజకీయ సామాజిక ఆర్థిక అరాచక శక్తులకు లక్ష్యంగా మారి హత్య చేయబడ్డారు

చనిపోయిన 28 మందిలో మహిళ. గౌరీ లంకేష్ ఒకరు. బడుగు బలహీన బాధిత ప్రజల కోసం పని చేస్తున్న గౌరీ లంకేష్ కర్ణాటకలో అధికార పార్టీ కోపానికి గురి అయ్యి చాలా విధాలుగా హింసాత్మకమైన ఆన్‌లైన్ వేధింపులకు గురైన తర్వాత ఆమె సెప్టెంబర్ 2017లో బెంగుళూరులోని తన ఇంటి వెలుపల అరాచక శక్తులుచే కాల్చి చంపబడింది .

ఈ వివరాలు అన్నీ RWB రిపోర్టర్స్ విత్ ఔట్ బోర్డర్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తన వార్షిక నివేదికలో పొందు పరిచింది. RSF యొక్క 2023 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాలలో భారతదేశం 161వ స్థానంలో ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com