జాన్వీ కపూర్ టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె టాలీవుడ్‌లో తన సత్తా చూపడానికి రెఢీ అయింది. ఇకపోతే శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీపై బోలెడన్ని అంచనాలున్నాయి. అందులోనూ ఎన్టీఆర్ తో జతకడుతోంది. ఇక ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జాన్వీ కపూర్ సర్వం వండి వారుస్తోందనడానికి తాజా సాంగ్ గ్లింప్స్ సరిపోతుంది. కొన్ని గడియల పాటు దేవర నుంచి రెండో పాట ‘చుట్ట మల్లె చుట్టేస్తా..’ షేక్ చేసింది.
జాన్వీతో యంగ్ యమ రొమాన్స్ మరో లెవల్‌లో పండింది. ఇక ఈ పాటలో జాన్వీ కపూర్ ని ఎలివేట్ చేసిన తీరు కానీ, తారక్ యంగ్ ఛరిష్మాటిక్ లుక్స్ కానీ ఫ్యాన్స్ లో జ్వరం పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు గ్లింప్స్ వైరల్ గా దూసుకెళ్లింది. ఇదే పాట హిందీ వెర్షన్ గ్లింప్స్ కూడా అంతే వైరల్ గా మారుతోంది. ధీరే ధీరే అంటూ సాగే ఈ పాటలో డ్యాన్సింగ్ క్లిప్ ని ఎన్టీఆర్ అభిమానులు వైరల్ గా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాట కోసం రామజోగయ్య రాసుకున్న లైన్స్ కానీ, ఎంపిక చేసుకున్న లొకేషన్స్ కానీ, కొరియోగ్రఫీ కానీ, గ్లామర్ ఎలివేషన్ కోసం ఎంపిక చేసిన కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతిదీ హైలైట్ గా ఉన్నాయి. కచ్ఛితంగా ఇది చలి జ్వరం పుట్టించే పాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తుంటే జాన్వీకి ఇంతకంటే బెస్ట్ డెబ్యూ వేరొకటి ఉండదేమో! అనేంత అందంగా తనను ఎలివేట్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.
ఇన్నాళ్లు జాన్వీని మోడ్రన్ దుస్తుల్లో వీక్షించిన ఆడియెన్ కి ఇలా చీరల్లో చూస్తే చలి జ్వరం వస్తోంది. హిందీ సినిమాలతో పోలిస్తే జాన్వీని ది బెస్ట్ గా కొరటాల శివ ఆవిష్కరిస్తున్నారని కూడా భరోసా కనిపిస్తోంది. తెలుగులో చుట్టమల్లె, హిందీలో ధీరే ధీరే, తమిళంలో పత్తవైక్కుం, కన్నడలో స్వాతిముత్తే సిక్కంగైతే, మలయాళంలో కన్నినాథన్ కమనోట్టం .. ఇలా అన్ని భాషలలో ఈ పాట ఇప్పటికే వైరల్ గా దూసుకెళ్లింది.