Tuesday, May 13, 2025

ఎన్టీఆర్ చేతి వాచ్ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో మంచి జోరుమీదుున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు కార్లు అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. కార్లతో పాటు వాచ్ కలెక్షన్ అంటే కూడా ఎన్టీఆర్ కు భలో ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో స్వయంగా ఎన్టీఆరే చెప్పారు. తనకు నచ్చిన బ్రాండెడ్ వాచ్ మార్కెట్ లోకి వచ్చిందంటే దాన్ని కొంటుంటారు ఎన్టీఆర్. అలా అని ఎన్టీఆర్ కొనే వాచ్ లు మాములువి కావు. వాటి ధర లక్షలే కాదు కోట్లలో ఉంటాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో వాచ్ లు ఉన్నాయట ఎన్టీఆర్ దగ్గర.

ఇప్పుడు మరో  బ్రాండెడ్ వాచ్ ను ఎన్టీఆర్ ధరించగా ఆ వాచ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న ఎన్టీఆర్ ట్రా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా ఓపెనింగ్ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈ ఫోటోలలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై అభిమానుల దృష్టి పడింది. ఈ వాచ్ ధర ఎంత ఉందని ఇంటర్నెట్ లో వెతికి, దాని రేటు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ ధరించిన వాచ్ స్విట్జర్లాండ్ కు చెందిన పాటక్ ఫిలిప్ అనే లగ్జరీ బ్రాండెడ్ కు సంబందించింది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, ఈ వాచ్ ధర సుమారు 2.45 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు.

ఎన్టీఆర్ గతంలో కూడా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఈ వాచ్ ధరించి వచ్చాడని అభిమానులు గుర్తు చేస్తున్నారు. నిజానికి ఈ బ్రాండ్ లో లభించే ప్రతీ వాచ్ చాలా విలువైనదేనట. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా దేవర లో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com