రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు, వ్యాపారులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా హైకోర్టులో పని చేస్తున్న 18 మంది జడ్జిలపైనా కూడా నిఘా పెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లో భాగంగా తెలంగాణ హైకోర్టులో పని చేస్తున్న 18 మంది జడ్జిలపైనా కూడా నిఘా పెట్టినట్లు తేలింది. దీనికి సంబంధించి న్యాయమూర్తుల వివరాలు ఈ కేసులో కీలకంగా ఉన్న ఒక నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ 18 మందిలో ఐదుగురు మహిళా జడ్జిల సమాచారం కూడా ఉండటం గమనార్హం. ఇటీవలే త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయిన అంశం వెల్లడి కాగా, తాజాగా 18 మంది న్యాయమూర్తుల పూర్తి ప్రొఫైల్ ఓ నిందితుడి కంప్యూటర్‌లో ఉండటంతో పోలీసులు ఖంగుతిన్నారు.
ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు. కేసులో మూడో నిందితుడిగా ఉన్న భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌కు సంబంధించి తాజాగా.. పోలీసుల చేతికి ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందింది. ఆ హార్డ్ డిస్క్‌లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్న అభ్యర్థులు, పలువురు జడ్జిల ప్రొఫైళ్లు బహిర్గతమయ్యాయి.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ర్టంలో సంచలనం రేకెత్తించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ర్టంలోని పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు, ఇతర ప్రముఖులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ నాటి తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు సహా, పలువురు పోలీసు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేయడంతో పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. మరోవైపు పలువురిపై విచారణ చేపట్టింది. కాగా ఈ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు రాజకీయ, ప్రభుత్వ అధికారుల విషయంలోనే ట్యాపింగ్‌కు పాల్పడిన ఆరోపణలుండగా తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్‌లో భాగంగా తెలంగాణ హైకోర్టులో పని చేస్తున్న 18 మంది జడ్జిలపైనా కూడా నిఘా పెట్టినట్లు తేలింది. దీనికి సంబంధించి న్యాయమూర్తుల వివరాలు ఈ కేసులో కీలకంగా ఉన్న ఒక నిందితుడి కంప్యూటర్‌లో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ 18 మందిలో ఐదుగురు మహిళా జడ్జిల సమాచారం కూడా ఉండటం గమనార్హం. ఇటీవలే త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయిన అంశం వెల్లడి కాగా, తాజాగా 18 మంది న్యాయమూర్తుల పూర్తి ప్రొఫైల్ ఓ నిందితుడి కంప్యూటర్‌లో ఉండటంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు. కేసులో మూడో నిందితుడిగా ఉన్న భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌కు సంబంధించి తాజాగా.. పోలీసుల చేతికి ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందింది. ఆ హార్డ్ డిస్క్‌లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్న అభ్యర్థులు, పలువురు జడ్జిల ప్రొఫైళ్లు బహిర్గతమయ్యాయి.
బ్లాక్ మెయిల్ చేశారా..?
వీరిలో ఇటీవల రిటైర్ అయిన ముగ్గురు జడ్జిలు, హైకోర్టు నుంచి ఇతర కోర్టులకు బదిలీ అయిన మరో ముగ్గురు జడ్జిల ప్రొఫైళ్లతో సహా మొత్తం 18 మంది జడ్జిల వివరాలు భుజంగరావు కంప్యూటర్‌లో లభ్యమయ్యాయి. ఇంకా నాంపల్లి ఏసీబీ కోర్టుల్లోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ కూడా ఆ కంప్యూటర్‌లో లభించింది. ఈ ప్రొఫైళ్లలో జడ్జిల ఫొటోలు, వారి స్వస్థలం, చదువు, ఉద్యోగప్రస్థానం, కుటుంబసభ్యుల వివరాలు అన్ని ఉన్నట్లు తేలింది. జడ్జిల వివరాలు కూడా బహిర్గతం కావడంతో ట్యాపింగ్‌కు పాల్పడిన నిందితులు వారి పోన్లను కూడా ట్యాపింగ్ చేశారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతేకాక ట్యాపింగ్ పలు రహాస్యాలు సేకరించి సదరు జడ్జిలను నిందితులు బ్లాక్ మెయిల్ చేశారా అనే కోణంలోనూ విచారణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నాడు వివిధ కేసుల విషయంలో ఆయా జడ్జిల పోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి తమకు అనుకూలంగా తీర్పులు ఇప్పించుకున్నారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
కాగా మరోవైపు ట్యాపింగ్ కేసు నమోదు కాగానే విదేశాలకు పరారైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను భారత్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిద్దరిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించేలా పోలీసుల ప్రక్రియను అడ్డుకునేందుకు నిందితులు శతథా ప్రయత్నిస్తున్నారు. పాస్‌పోర్టులు సైతం రద్దు చేయొద్దంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఇప్పటికే దరఖాస్తులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులకు హైకోర్టు గురువారం (జనవరి 30) షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. కాగా జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు బహిర్గతం కావడం, సంబంధిత వివరాలు భుజంగరావు కంప్యూటర్‌లో దొరకడంతో భుజంగరావు బెయిల్ రద్దు అయ్యే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.