దెబ్బతిన్న జూరాల క్రస్ట్ గేట్లు.. భారీగా లీకవుతున్న నీళ్లు
ఓ వైపు కృష్ణా నదిలో నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోతున్నా పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్.. మరో వైపు ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడంతో వృధాగా కృష్ణమ్మ దిగువకు పోతున్నది. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల డ్యామ్ నుంచి నీరు లీక్ అవుతున్నది. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో తుప్పు పట్టి, రబ్బర్‌లు ఊడిపోయాయి. దీంతో మొత్తం 12 క్రస్ట్ గేట్ల నుంచి నీరు దిగువకు పోతున్నది. ఇందులో 8 గేట్ల రోప్ దెబ్బతిన్నది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జూరాల ప్రాజెక్టును 1995లో ప్రారంభించారు. 9.68 టీఎంసీల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు జలాశయం నిండు కుండలా ఉంది. అయితే పాలకుల నిర్లక్ష్యం ప్రాజెక్టును వెంటాడుతున్నది. క్రస్ట్ గేట్లకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో తుప్పుపట్టి గేట్లకు అమర్చిన రబ్బర్లు ఊడిపోయాయి. దీంతో ఆ ప్రాతంలో నీరు లీకవుతుండటంతో క్రమంగా ప్రాజెక్టు ఖాలీ అతువున్నది. వేసవి నాటికి పరిస్థితి ఇలాగే కొనసాగితే జూరాలపై ఆధారపడిన ప్రజలకు నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది.