Thursday, January 9, 2025

కాషాయానికి కొత్త సారథి

కొత్త ఏడాదిలో కొత్త బాస్‌

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు? హైకమాండ్ తన నిర్ణయాన్ని ఇంకా సాగదీస్తుందా? జనవరి రెండోవారానికి తేల్చుతుందా? అధినేత ఎవరనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. సామాజిక సమీకరణాల కాకుండా.. కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడ్ని ఎంపిక చేస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఆదివారం జేపీ నడ్డా ఆధ్వర్యంలో సంఘటన్ సర్వ్ సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్ ఛార్జులు హాజరయ్యారు. తెలుగు రాష్ఠ్రాల నుంచి పురందేశ్వరి, కిషన్‌రెడ్డి, డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షురాలు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ పార్టీ బూత్, మండల స్థాయి కమిటీల భర్తీపై నివేదికను కిషన్‌రెడ్డి… నడ్డాకు అందజేశారు. తెలంగాణలో దాదాపు 70 శాతం బూత్, మండల స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయినట్టు తెలిపారు కిషన్‌రెడ్డి. జనవరి ఫస్ట్ వీక్‌లో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ చేయనున్నారు.

సెకండ్‌ వీక్‌లో కొత్త అధ్యక్షుడు
వచ్చేనెల సెకండ్ వీక్‌లో కొత్త అధ్యక్షుడిపై ప్రకటన రానుంది. దీంతో కొత్త బాస్ ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త అధ్యక్షుడి రేసులో నలుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారంతా ఎంపీలే కావడం గమనార్హం. ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్, బండి సంజయ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఎవరూ రేసులో లేనట్టు తెలుస్తోంది. ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అధిష్టానికి కత్తి మీద సాముగా మారింది. ఈ నలుగులు ఎవరికైనా ఇస్తే పార్టీకి ఇబ్బందులు వస్తాయని భావించి కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తుందా? అనే చర్చ లేకపోలేదు. మరోవైపు అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేశాయనే చర్చ మొదలైంది. దాని నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో దళత వ్యక్తిని జాతీయ అధ్యక్ష పీఠంపై కూర్చొబెడితే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా దళిత నేత మల్లికార్జునఖర్గే ఉన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా దళిత వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నట్లు ఓ వార్త పొలిటికల్ సర్కిల్స్‌లో హంగామా చేస్తోంది. అంబేద్కర్ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంతకంటే మార్గం మరొకటి లేదన్నది కొందరి నేతల మాట.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com