Thursday, April 3, 2025

కాబోయే భార్యతో క్యూట్‌గా…?

హీరో నారా రోహిత్.. త్వరలో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్న విషయం తెలిసిందే. ఆయన గత మూవీ ప్రతినిధి -2 హీరోయిన్ సిరి లేళ్లతో రోహిత్ నిశ్చితార్థం ఇప్పటికే జరగ్గా.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అంతా బెస్ట్ విషెస్ తెలిపారు. ఇప్పుడు కాబోయే భార్యతో నారా రోహిత్ దిగిన కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందరినీ ఆకట్టుకుని అలరిస్తున్నాయి. ఉగాది స్పెషల్ గా రోహిత్.. తన అత్తవారింటికి వెళ్లినట్లు క్లియర్ గా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి అల్లుళ్లు.. అత్తవారింటికి వెళ్లడం ఒక సంప్రదాయమని తెలిసిందే. ఆ విధంగానే వెళ్లిన రోహిత్.. సిరితో సరదాగా గడిపారు. సెల్ఫీతో పాటు కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అందులో ఇద్దరూ హ్యాపీ మోడ్ లో కనిపించారు. క్యాండిడ్ క్లిక్స్ తో వైరల్ గా మారగా.. నెటిజన్లు తెగ లైక్లు కొడుతున్నారు. ఫోటోలు అదిరిపోయాయని, సో క్యూట్ అని చెబుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com