Monday, April 21, 2025

విశ్రాంత ఈఎన్సీ వెంకటేశ్వర్లుపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో 2019 నుంచే సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటిపై నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్సీ జనరల్ సమావేశాలు సైతం నిర్వహించారని విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. వరుసగా రెండో రోజు ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. మూడు ఆనకట్టలకు సంబంధించిన పలు అంశాలపై వెంకటేశ్వర్లును కమిషన్‌ ప్రశ్నించింది. మొదట నిర్మించిన కాఫర్ డ్యాం వరదలో మునిగిపోవడంతో ఎత్తు పెంచాల్సి వచ్చిందన్న వెంకటేశ్వర్లు డిజైన్ల తయారీలో ఆలస్యం జరిగిందని చెప్పారు.

డిజైన్ల ఖరారులో ఆలస్యం, మార్పుల కారణంగా అంచనా వ్యయం పెరిగిందని కమిషన్‌కు వివరించారు. డిజైన్‌లో మార్పులతో అంచనా వ్యయం అంత భారీగా పెరుగుతుందా? అని కమిషన్ ప్రశ్నించింది. ఈ దశలో వెంకటేశ్వర్లుపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమచారం. కాళేశ్వరానికి ముందు ప్రాణహిత – చేవెళ్ల కోసం రూ.14వేల కోట్లకు పైగా విలువైన పనులు చేశారని.. అందులో రూ.750 కోట్ల విలువైన పనులు ఫలితం లేకుండా పోయాయని వెంకటేశ్వర్లు తెలిపారు.

సవరించిన అంచనా వ్యయాన్ని అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆమోదించారని చెప్పారు. మేడిగడ్డ విషయంలో సబ్ స్టాన్షియల్ సర్టిఫికెట్, మిగతా రెండు బ్యారేజీలకు పూర్తి సర్టిఫికెట్ ఇచ్చామన్న వెంకటేశ్వర్లు స్థానిక అంశాలు, భూసేకరణ వల్లే బ్యారేజీల పనుల్లో ఆలస్యం అయినట్లు వివరించారు. పనులు ఆలస్యం అవుతున్నప్పుడు మౌఖిక ఆదేశాలు ఇచ్చామన్నారు. అత్యవసరం కాబట్టే డ్రాయింగ్స్ ఆలస్యమైనా పనులు చేయాలని చెప్పామని పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com