Sunday, April 20, 2025

Kaleswaram commission report ఫస్ట్‌ రిపోర్ట్‌ రెడీ

కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టులో సంచలన విషయాలు

కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగినట్లుగా జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. కింది నుంచి పైస్థాయి వరకు అందరకీ భారీగానే ముడుపులు అందినట్లుగా కమిషన్ అంచనాకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగినట్లుగా జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. కింది నుంచి పైస్థాయి వరకు అందరకీ భారీగానే ముడుపులు అందినట్లుగా కమిషన్ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే 204 పేజీలకుపైగా రిపోర్ట్​ను రెడీ చేసిన చంద్రఘోష్‌ కమిషన్.. 2025 ఫిబ్రవరి చివర్లో లేదంటే మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను అందించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన ఫైళ్లను అధ్యయనం చేయడంతో పాటు పలువురు సాక్షులను ప్రశ్నించి సేకరించిన ఆధారాలతో ఈ రిపోర్ట్​ను కమిషన్‌ తయారు చేసింది.

బ్యారేజీల నిర్మాణంతో పాటుగా ఇతర పనుల్లో కూడా భారీగానే అవినీతి జరిగిందని కమిషన్‌ నిర్థారణకు వచ్చినట్టు తెలిసింది. కాంట్రక్టర్లలకు లబ్థి చేకూర్చే విధంగా ఏటా అడ్డగోలుగా అంచనాలు పెంచడంతో పాటు జరగని పనులకూ కూడా రూ.కోట్లలో బిల్లులు జారీ చేసినట్టు కమిషన్ ఆధారాలు సేకరించినట్లుగా సమాచారం. ఒక బ్యారేజీ విషయంలో అయితే అసలు పనులు ఏం ప్రారంభించకముందే 25 శాతానికి పైగా నిధులను కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లుగా కమిషన్‌ గుర్తించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు లో పాలుపంచుకున్న ప్రస్తుత రిటైర్డ్​ ఈఎన్సీలు, ఇంజినీర్లు, ఐఏఎస్​లు, కంపెనీల ప్రతినిధులను చంద్రఘోష్‌ కమిషన్‌ గత ఐదు నెలలుగా విచారణ చేస్తోంది. మొదటి దశలో అఫిడవిట్లు తీసుకొని ఆ తరువాత క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ నెలలోమరికొందరు సాక్షులను ప్రశ్నిస్తే దాదాపుగా విచారణ పూర్తి కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ రిపోర్టును కమిషన్ ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. మంగళవారం నుంచి కమిషన్ మళ్లీ ఓపెన్​ కోర్టు నిర్వహించనుంది. ఫైనాన్స్​స్పెషల్​ సీఎస్​ రామకృష్ణారావు, ఇతర ఆర్థిక శాఖ అధికారులను కమిషన్ విచారణకు పిలువనుంది.

మొదటిరోజు విచారణలో సీఎస్​ రామకృష్ణారావును ఫైనాన్స్​వ్యవహారాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు అనుమతుల జారీలో ఆర్థిక శాఖ కీలక పాత్ర పోషించింది. మాజీ ఈఎన్సీలను మరోసారి ఓపెన్​ కోర్టులో క్రాస్​ ఎగ్జామినేషన్​ చేయనుంది. బీఆర్‌ఎస్‌ నేత వి.ప్రకాషతో పాటు బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా కమిషన్‌ ప్రశ్నించే అవకాశంఉంది. మిగితా అధికారులను రెండో రోజు పిలిచే అవకాశం ఉంది.

బలమైన సాక్ష్యాధారాలను సిద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయాలు తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లను కూడా కమిషన్ విచారణకు పిలువనుంది. ముందుగా వీరికి సమన్లు జారీ చేసి ఫిబ్రవరిలో విచారణకు పిలిచే అవకాశం ఉంది. వారిని విచారించడానికి కమిషన్ బలమైన సాక్ష్యాధారాలను సిద్ధం చేసుకుంటోంది. ముందుగా హరీశ్, ఈటలను ప్రశ్నించాక ఆ తరువాత కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించనుంది. దీంతో విచారణ ముగుస్తుంది. అనంతరం రిపోర్టును సిద్థం చేసి ప్రభుత్వానికి సమర్పించనుంది కమిషన్.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com