- ఇంజినీర్ల రిపోర్ట్‌ను పట్టించుకోలేదు
- తుమ్మడిహట్టి దగ్గర ప్రపోజ్ చేస్తే పక్కన పడేశారు
- జ్యుడిషియల్ కమిషన్ ముందు రిటైర్డ్ ఇంజినీర్ల నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కీలకమైన బ్యారేజీల నిర్మాణానికి మేడిగడ్డను ఎంపిక చేసింది కేసీఆర్ అని, అంతా ఆయన చెప్పినట్టే జరిగిందని రిటైర్డ్ ఇంజినీర్ల బృందం వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపాలపై న్యాయ విచారణలో భాగంగా శనివారం హైదరాబాద్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విశ్రాంత ఇంజినీర్లతో సమావేశమైంది. ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డను మాజీ సీఎం కేసీఆర్ సూచించారని ఈ బృందం తెలిపినట్లు అధికారులు చెప్పారు. ప్రధాన నిర్మాణ సంస్థలతో పాటుగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై ఘోష్ కమిషన్దృష్టి సారించింది. వాటన్నింటి వివరాలు ఇవ్వాలని సైతం ఆదేశాలు జారీ చేసింది.
నివేదికను కమిషన్‌కు ఇచ్చిన రిటైర్డ్ ఇంజినీర్ల బృందం
కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని విశ్రాంత ఇంజినీర్లు విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు చెప్పినట్లు వెల్లడైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. రిటైర్డ్ ఇంజినీర్లను ప్రశ్నించింది. దీనిలో భాగంగా 2015లో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక, సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజినీర్ల కమిటీ సభ్యులు కమిషన్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో గోదావరి జలాల వినియోగంపై ఐదుగురు విశ్రాంత ఇంజినీర్ల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చిందని, విశ్రాంత ఇంజినీర్లు అనంత రాములు, వెంకటరామారావు, చంద్రమౌళి, శ్యాం ప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నట్లు ఈ సందర్భంగా కమిషన్‌కు వివరించారు. దీంతో నివేదికలోని అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రాణహిత – చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటు గోదావరి జలాల లభ్యత, కేంద్ర జల సంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చింది. ఆనకట్ట నిర్మాణానికి అనువైన స్థలంగా మేడిగడ్డను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని విశ్రాంత ఇంజినీర్లు కమిషన్ ముందు చెప్పింది. అయితే, తుమ్మడిహట్టి దగ్గర ప్రతిపాదనలను తాము చేస్తూ ఇచ్చిన నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి, అధికారులు సంతకాలు చేయలేదని కూడా వారు కమిషన్‌ముందు వివరించారు.
కాగా, ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను ఇటీవల శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాల ఎత్తిపోత సబబు కాదని కమిటీ సూచించిందని, దాన్ని తొక్కిపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారన్న విషయమై కమిషన్ ఆరా తీసింది. అందుకు సంబంధించిన అంశాలను విశ్రాంత ఇంజనీర్ల దగ్గర విచారించిన కమిషన్‌కు.. అప్పటి సీఎం కేసీఆర్ ప్లాన్మొత్తాన్ని వివరించారు.