Saturday, December 28, 2024

ఆసక్తికర కథా కథనాలతో “కలి” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – దర్శకుడు శివ శేషు

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తన ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు శివ శేషు. చిన్నప్పటి నుంచి సాహిత్యం చదవడం, రచనలు చేయడం అలవాటు. స్క్రిప్ట్ బాగా రాస్తాను. దర్శకుడు కావాలన్నది నా కోరిక. కొంతకాలం బిజినెస్ చేశాను కానీ తిరిగి నేను ఇష్టపడే చిత్ర పరిశ్రమకే వచ్చాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేశాను. ఆ తర్వాత భాగమతి దర్శకుడు అశోక్ దగ్గర, సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ దగ్గర పనిచేశాను. లాక్ డౌన్ టైమ్ లో కలి పేరుతో స్క్రిప్ట్ రెడీ చేశాను. ప్రిన్స్ కు చెబితే చాలా బాగుంది చేద్దామని అన్నారు.

రుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గౌతమ్ వర్మ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అలా మా కలి మూవీ మొదలైంది. అయితే ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జగపతి బాబుని ఓ క్యారెక్టర్ కు అనుకున్నాం. అయితే మూవీ ప్రొడక్షన్ కు జగపతి బాబు కాస్టింగ్ సెట్ కాలేదు. దాంతో నరేష్ అగస్త్య కు ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి మూవీలో నటించారు. కలి కథ సిద్ధమయ్యాక ఏడాదిన్నర ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ కు టైమ్ పట్టింది. ఈ సినిమా ఒక లొకేషన్ లో జరుగుతుంది. ఫిలింసిటీలో సెట్ వేశాం. మా సినిమా పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ టీమ్ అంతా యంగ్ బ్యాచ్. స్పష్టమైన ఆలోచనలతో వర్క్ చేశాం కాబట్టి ఎక్కడా ఇబ్బంది రాలేదు. హ్యాపీగా టీమ్ వర్క్ తో మూవీ కంప్లీట్ చేశాం. కె.రా‌ఘవేంద్ర రెడ్డి గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం. ఇద్దరు పాత్రల మధ్య కథ సాగినా స్క్రిప్ట్, డైలాగ్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి కాబట్టి సినిమా అంతా ఆసక్తికరంగా సాగుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com