Tuesday, December 24, 2024

Kalki 2898 AD Movie Review And Rating: కలలో కూడా ఊహించలేని క్లైమాక్స్…కల్కి 2898 ఎడి

ఫైనల్లీ .. కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురు చూసిన కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు . ఇప్పటికే అమెరికాలో షోస్ పడిపోయాయి సినిమాకి సంబంధించిన మొదటి రివ్యూ కూడా బయటకు వచ్చేసింది . సినిమా చూసిన జనాలు ఓ రేంజ్ లో కల్కి సినిమాను పొగిడేస్తున్నారు. నాగ్ అశ్వీన్ డైరెక్షన్ వేరే లెవల్ అని .. ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసినట్లు మరి ఏ సినిమాలో చూసి ఉండమని ..నిజంగా రెబెల్ అభిమానులకు ఇది ఒక ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పుకొస్తున్నారు .

తెలుగు చిత్రసీమలో సైన్స్ ఫిక్షన్ విభాగంలో ఒక విశిష్ట చిత్రం ‘కల్కి 2898 ఎడి’. ఈ చిత్రం ప్రస్తుత కాలానికి విభిన్నమైన, భవిష్యత్తును ప్రతిబింబించే కథతో ముందుకు వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ప్రేక్షకులను భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకెళుతుంది.

కథనం:

2898 ఎడి సంవత్సరంలో సెట్ అయిన ఈ సినిమా, భవిష్యత్ ప్రపంచంలోని ఒక విభిన్నమైన సమాజాన్ని, అనేక సాంకేతిక పరిజ్ఞానాలను చూపిస్తుంది. ఈ కథలో మనుషుల మధ్య సంబంధాలు, నైతికత, సాంకేతికత ప్రభావాలు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. కథలో హీరో పాత్రలో ప్రభాస్, వారి ప్రయాణం, ఆత్మాన్వేషణను ఆకర్షణీయంగా చూపించారు. కథలోకి హీరో ఎలా ప్రవేశిస్తాడు, భవిష్యత్ లో మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి, అనే విషయాలు ఆసక్తిగా తీర్చిదిద్దారు.

Kalki 2898 AD Review and Rating

అంతేకాదు పురాణాలను లింక్ చేసుకొని టెక్నాలజీని ఉపయోగించి నాగ్ అశ్వీన్ అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు అని.. థియేటర్స్లోకి వెళ్లి సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనం సరికొత్త లోకంలోకి వెళ్ళిపోతామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు పురాణాలను ఆధునిక ప్రపంచాన్ని కంబైండ్ చేసి నాగ్ అశ్వీన్ కథను వలచిన తీరుని ఓ రేంజ్ లో ప్రశంసలు వస్తున్నాయి. సినిమాకి మెయిన్ హైలెట్ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ కచ్చితంగా ప్రతి ఒక్క అభిమానిని అలాగే జనాలని మంత్రముగ్ధులను చేస్తుంది.

క్లైమాక్స్:

క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించిన విధంగా 100 రెట్ల ట్విస్టులతో భలే మలుపు తిప్పాడు అని.. నాగ్ అశ్విన్ మైండ్ అద్భుతమైన విధంగా వర్క్ చేస్తుంది అని ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ లేరు అని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అయితే ఈ చిత్రం మైథలాజికల్‌ అవ్వడంతో చాలా మందికి కథ అర్థం అయి అవ్వనట్లు ఉంది. కొంత మంది ఏదో ప్రభాస్‌ కట్‌అవుట్‌ కోసం వెళ్ళాలి అంటే మరికొందరు మాత్రం విజువల్ ఎఫెక్ట్స్‌ తప్ప ఏమీ లేదు అంటున్నారు. ఫస్గ్‌ ఆఫ్‌ అంతా బోర్‌ కథ చాలా నిధానంగా నడుస్తది ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే పర్వాలేదనిపించుకుంది. ఫైనల్‌గా పర్వాలేదని చెప్పాలి. కాకపోతే ప్రతి పాత్రకి తీసుకున్న నటీనటులు మాత్రం హైలెట్‌గా కనిపిస్తున్నారని చెప్పవచ్చు. నాగఅశ్విన్‌ కాస్టింగ్‌ మాత్రం అద్భుతంగా తీసుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com