Friday, January 10, 2025

క్లైమాక్స్‌ అంత కిక్కెక్కుతుందా?

డార్లింగ్‌ హీరో ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం కల్కి. నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్ర కథాంశం సైన్స్‌ ఫిక్షన్‌గా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్ర రేంజ్‌ విషయానికి వస్తే మొత్తం హాలీవుడ్‌ రేంజ్‌లో దీని స్టాండర్డ్స్‌ఉండబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి టాప్ స్టార్స్ అందరూ ఒకే తెర పై కనిపించి ఫ్యాన్స్‌కు కనులవిందు చేయనున్నారు. ఇక గత కొద్ది రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాచురల్ స్టార్ నాని సైతం ఈ సినిమాల్లో భాగం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. భారీ గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌ తో హాలీవుడ్ సినిమాలను మించేలా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తీర్చిదిద్దుతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూపించని ఓ సరికొత్త భవిష్యత్ ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘కల్కి’ క్లైమాక్స్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతుందట.

ఈ సినిమా క్లైమాక్స్ లో బిగ్గెస్ట్ స్టార్స్ ఉంటారని తెలిసింది. అంటే సినిమాలో నటిస్తున్న స్టార్ కాస్ట్ తో క్లైమాక్స్ ఉంటుందట. వచ్చేవారం నుంచి మూవీ టీం క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ ని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ క్లైమాక్స్ షూటింగ్‌లో ప్రభాస్ తో పాటు కమలహాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నానితో పాటూ మరికొందరు అగ్ర నటీనటులు పాల్గొంటారట. మొత్తానికి మన డైరెక్టర్లు కూడా కాస్త బాలీవుడ్‌.. హాలీవుడ్‌ రేంజ్‌లో ఆలోచిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎక్కువగా ఈ కల్చర్‌ ఉంటుంది. బాలీవుడ్‌ హీరోలు వాళ్ల స్టార్‌డమ్‌ ఏదీ చూసుకోకుండా ఒకరి సినిమాల్లో మరొకరు కనిపిస్తుంటారు. అలా కనిపించి ప్రేక్షకులకి కనువిందు చేస్తుంటారు. మరీ అదే విధంగా ఇప్పుడు తెలుగులో కూడా చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ క్లైమాక్స్‌.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com