Thursday, January 2, 2025

కాళ్లు పట్టుకుంటే పనులు జరగవు

వినూత్న బోర్డు పెట్టిన కేంద్ర మంత్రి

పాదాలను తాకడంపై నిషేధం ఉందని.. అలా చేసిన వారికి పనులు అప్పగించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ లోని తికమ్‌గఢ్‌ లోని తన కార్యాలయం వద్ద వినూత్న బోర్డు ఏర్పాటు చేశారు. ‘పాదాలను తాకడంపై నిషేధం ఉంది. అలా చేసిన వారికి ఎటువంటి పనులూ అప్పగించేది లేదు’ అంటూ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఇది చూసిన స్థానిక ప్రజలు, రాజకీయ నేతలు షాక్‌ అవుతున్నారు. కార్యాలయం వద్దకు వచ్చిన వారంతా ఈ బోర్డును ఆసక్తిగా తిలకిస్తున్నారు. కేంద్ర మంత్రి చేసిన ఈ పనిని ప్రశంసిస్తున్నారు.
కాగా, వీరేంద్ర కుమార్‌కు స్థానికంగా ఓటమి ఎరుగని నాయకుడిగా పేరుంది. ఆయన 1996లో తొలిసారి సాగర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తికమ్‌గఢ్‌ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానం నుంచి 2009లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019లో ఆ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు 2024లోనూ అదే విజయ పరంపర కొనసాగించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com