Wednesday, March 12, 2025

భూకబ్జా కేసులో కల్వకుంట్ల కుటుంబ సభ్యుడు అరెస్టు

కన్నారావు మాజీ సీఎం కేసీఆర్ కు సమీపబంధువు

టీఎస్​, న్యూస్​: ఓ భూకబ్జా కేసులలో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా కేసులో కన్నారావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆదిభట్ల పోలీసులు మంగళవారం తెల్లవారుజామున బాలాపూర్ సమీపంలో కన్నారావును అరెస్టు చేశారు. తుర్కయాంజల్, మన్నెగూడలో రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు సహా మరికొందరు ప్రయ్నించినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ భూకబ్జా వ్యవహారంలో తలదూర్చి మూడు కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకొని, రూ. 2.35 కోట్ల అడ్వాన్సు తీసుకొని భూ సెటిల్ మెంట్ చేసినందుకు కన్నారావుపై కేసు నమోదైన‌ విషయం తెలిసిందే.

Also Read: ‘ తెల్లం’ పోయినట్టే..!!

ఇందుకు సంబంధించి మార్చి 3వ తేదీన ఓఎస్ ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కన్నారావుతో పాటు 38 మందిపై కేసు నమోదైంది. కన్నారావుకు చెందిన వ్యక్తులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా తమ భూమిలోకి చొరబడి విధ్వంసకర వ్యూహాలకు పాల్పడి జేసీబీతో సరిహద్దు గోడలను ధ్వంసం చేయడం, పెన్సింగ్ వైరును కత్తిరించడం, ఆవరణలోని ఫర్నిచర్ ను తగులబెట్టడంతో పాటు భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారని బండోజు శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదిబట్ల పోలీసులు కన్నారావుపై హత్యాయత్నం, క్రిమినల్ చొరబాటు, నష్టం కలిగించడం, పేలుడు పదార్ధాలు ఉపయోగించడం, అల్లర్లకు పాల్పడటం వంటి ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఏ3 గా ఉన్న కన్నారావు తప్పించుకు తిరుగుతున్నాడు. తనపై నమోదైన భూకబ్జా కేసు కొట్టి వేయాలని హైకోర్టును కన్నారావు ఆశ్రయించారు. అయితే, హైకోర్టు కన్నారావు పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో, కన్నారావు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

పోలీసులకు పట్టుబడకుండా కేరళ, బెంగళూరు, మాల్దీవులు తిరుగుతూ, 7 సెల్ ఫోన్లు వాడుతూ తప్పించుకు తిరిగాడని సమాచారం. మరో మారు బెయిల్ పిటిషన్ ప్రయత్నంలో హైదరాబాద్ కు వచ్చాడు. బొల్లారంలో అడ్వకేట్ ను కలుసుకోవడానికి సిద్దిపేట నుండి బొల్లారం వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో అడ్వకేట్ కలుసుకునే స్థావరాన్ని కన్నారావు మార్చుకుని, బాలాపూర్ సమీపంలో కలుసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలాపూర్ సమీపంలో రెండు బృందాలుగా గస్తీ కాసి ఉన్న పోలీసులు కన్నారావును అరెస్టు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com