ఢిల్లీ మద్యం కేసులో తిహాడ్ జైళ్లో రిమాండ్‌పై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నెల 31 వరకు జైలులోనే ఉండనున్నారు. ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో సాధ్యం కాలేదు. ఈ మేరకు గతంలో ప్రత్యేక కోర్టు కవితకు విధించిన రిమాండ్ ముగియనుండగా, సీబీఐ అధికారులు కవితను మరో కోర్టులో వర్చువల్‌గా హాజరుపర్చారు. తదుపరి విచారణను జులై 31కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా చేపట్టనున్నారు.