ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. సీబీఐ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఉపసంహరించుకోవడం సంచలనం రేపింది. కాగా కవిత పిటిషన్‌పై ఈ నెల 7న తుది విచారణ జరపనున్నట్లు ఈనెల 5న కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రేపటి విచారణ దృష్ట్యా పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు కవిత తరపున లాయర్లు కోర్టుకు తెలిపారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసిన కవిత ఛార్జిషీట్‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
దీంతో సీబీఐ ఛార్జిషీట్‌ను పరిగణనలోకితీసుకుంటున్నట్లు ప్రకటించిన కోర్టు సీబీఐ ఛార్జిషీట్‌పై ఈనెల 9న విచారణకు సిద్ధమైంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నందున డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అయితే సోమవారం లాయర్లు అందుబాటులో లేకపోవడంతో కవిత న్యాయవాదులు కేసు వాయిదా కోరారు. ఈ క్రమంలో ఆమె తరపు న్యాయవాదులు విచారణకు రాకపోవడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 5న చోటు చేసుకున్న పరిణామాలతో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.