కమ్మ సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి హామీ ఇచ్చారు. కమ్మ సామాజికవర్గం సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిసిన కమ్మ ప్రతినిధులు సిఎం ఈ సందర్భంగా హామీనిచ్చారు.
ఈ క్రమంలోనే ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కమ్మ ప్రతినిధులు ఆసక్తికర పోస్ట్ చేశారు. గురువారం తెలంగాణ కమ్మ సామాజికవర్గ ప్రతినిధులు సిఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీంతోపాటు కమ్మ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినందుకు కమ్మ ప్రతినిధులు ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.