Thursday, December 26, 2024

Kane-Betwa river linking project కేన్‌-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన

కేన్‌-బేట్వా నదీ అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర్‌ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్‌ పాటిల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేన్‌-బేట్వా నదుల నుంచి తీసుకువొచ్చిన నీటి కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు.

అయితే ఆ కలశాల్లో ఉన్న నీటిని.. ప్రాజెక్టుకు చెందిన నమోనా మోడల్‌పై ప్రధాని మోదీ పోశారు. మధ్యప్రదేశ్‌లోని 10 జిల్లాలకు చెందిన 44 లక్షల మందికి, యూపీకి చెందిన 21 లక్షల మందికి.. నదీ అనుసంధానం ప్రాజెక్టుతో తాగునీటిని అందించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 44 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండు వేల గ్రామాల్లోని 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com