Tuesday, March 11, 2025

డబ్బు తీసుకుని… పెళ్ళిలో డ్యాన్సులా?

డబ్బు ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళు ఎంత హంగు ఆర్భాటంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవసరమైన డబ్బులు ఇచ్చి మరీ డ్యాన్సర్లను పెట్టుకుంటారు. ఇక ఇలాంటి బడా బాబుల ఇళ్లల్లో పెళ్లిళ్ళకు సెలబ్రెటీలు డబ్బులు తీసుకుని మరీ డాన్సులు వేయడం అన్నది సర్వ సాధారణం. స‌ల్మాన్, హృతిక్, అమీర్, షారూఖ్ ఇలా అగ్ర న‌టులంతా కెరీర్ తొలి నాళ్ల‌లో సెల‌బ్రిటీ వెడ్డింగ్స్ లో డ్యాన్సులు చేసి దానికి ప్యాకేజీలు అందుకునేవారు. అయితే ఇలాంటి వాటికి పూర్తి వ్య‌తిరేకంగా ఉండే తార‌లు ఉన్నారు. అలాంటి వారిలో క్వీన్ కంగ‌న కూడా ఒక‌రు. తాజాగా అంబానీల ప్రీవెడ్డింగ్ ఈవెంట్లో హిందీ తార‌ల డ్యాన్సింగుల గురించి కంగ‌న చేసిన వ్యాఖ్య దుమారంగా మారింది. అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో బాలీవుడ్ తారలు డ్యాన్స్ చేయడంపై కంగనా రనౌత్ పరోక్షంగా విరుచుకుపడింది అంటూ ప్ర‌చారం సాగుతోంది.

మార్చి 1 నుంచి 3 వ‌ర‌కూ గుజ‌రాత్ జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ ఉత్సవాల్లో పలువురు బాలీవుడ్ A-లిస్టర్‌లు డ్యాన్స్ ఫ్లోర్ పై విరుచుకుప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ముగ్గురు ఖాన్‌లు..రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, దిల్జిత్ దోసాంజ్, కరీనా కపూర్ ఖాన్ ఇలా ప్రతి ఒక్కరూ డ్యాన్సుల‌తో అల‌రించారు. అయితే హిందీ తార‌లు ఇలా డ్యాన్స్ చేసినందుకు కంగనా రనౌత్ ప‌రోక్షంగా సెటైర్ వేసార‌ని గుస‌గుస వినిపిస్తోంది. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వార్తా కథనం స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయ‌గా, అందులో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తాను పెళ్లిలో ఎప్పుడూ పాడనని పేర్కొన్నట్టు తెలిపారు. `మీరు నాకు ఐదు మిలియన్ డాలర్లు ఇచ్చినా నేను రాను.. లతా మంగేష్కర్ పెళ్లిలో పాడటానికి నిరాకరించారు` అని ఆ వార్తా కథనానికి శీర్షిక ఉంది.

తన కెరీర్‌లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అనేక హిట్ పాటలు త‌న‌తో ఉన్నప్పటికీ ఆత్మ‌ గౌరవం అనుమతించకపోవడంతో వివాహాలలో ప్రదర్శన ఇవ్వడానికి ఎప్పుడూ అంగీకరించలేదని కంగ‌న‌ పేర్కొంది. నేను ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను.. కానీ లతా జీ – నేను భారీ హిట్ పాటలను కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రమే . అయితే ఎన్ని ప్రలోభాలకు లోనైనా నేను పెళ్లిళ్లలో ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు.. చాలా సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ కూడా నాకు ఆఫర్ చేసారు. కానీ చేయ‌లేదు. త‌దుప‌రి నేను అవార్డు షోలను కూడా తప్పించాను. డ‌బ్బుకు నో చెప్పడానికి బలమైన వ్య‌క్తిత్వం ఆత్మ‌గౌరవం అవసరం. షార్ట్ కట్‌ల ప్రపంచంలో యువతరం వారు సంపాదించగల సంపద మాత్రమే సమగ్రత (థంబ్స్ అప్ ఎమోజి)“ అని కంగ‌న‌ రాసారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com