ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ విషయాల్లో వార్తల్లో నిలుస్తుంది. కంగన నటి మాత్రమే కాదు బీజేపీ ఎంపీగా కూడా పోటీ చేసి ఇటీవలె రాజకీయంగా కూడా విజయం సాధించారు. ఎంపీ కంగనాను సీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారి చెందపదెబ్బ కొట్టారు. చండీగఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళా అధికారి అయిన కుల్విందర్‌కౌర్ కంగనా పై దురుసుగా ప్రవర్తించి చెంప దెబ్బ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కంగనా గతంలో రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కౌర్ ఇలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.