Monday, March 31, 2025

సూసైడ్ సీరియల్

  • పవిత్ర మరణంతో చంద్రకాంత్​ ఆత్మహత్య
  • వారంలోనే త్రినయని సీరియల్​ ఇద్దరు నటులు మృతి

పవిత్ర మృతిని తట్టుకోలేకపోయిన చంద్రకాంత్‌ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, రోడ్డు ప్రమాద రూపంలో పవిత్ర చనిపోవడంతో.. చంద్రకాంత్​ తట్టుకోలేకపోయాడు. అయితే చంద్ర కాంత్ గతంలో శిల్ప అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలంగా చంద్రకాంత్ పవిత్ర జయరామ్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

సీరియల్ నటుడు చందు ఆత్మహత్య సంచలనంగా మారింది. సీరియల్ నటి పవిత్ర జయరామ్ గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో ఆమె ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్‌ గాయపడ్డాడు. పవిత్ర మృతిని తట్టుకోలేకపోయిన చంద్రకాంత్‌ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

Karnataka sex abuse case prajwal revanna case

కాగా చందు ఆత్మహత్య పై అతని భార్య శిల్ప స్పందించారు. అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్ర తో చందు సహజీవనం చేస్తున్నాడని ఆమె అన్నారు. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వివరించారు. త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర నుంచి చందుకు పవిత్రతో సంబంధం మొదలైందని, పవిత్రతో రిలేషన్ లో ఉంటూ తనను పిల్లల్ని వదిలేసాడని, చందు తనతో ఐదేళ్ల నుండి మాట్లాడట్లేదంటూ ఎమోషనల్ అయ్యారు.

పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడపి. కానీ పవిత్ర కు చందు కాకుండ ముందు చాల రిలేషన్స్ ఉన్నాయి అని శిల్ప అన్నారు. పవిత్ర మాయ లో పడి చందు ఈ విధంగా అయ్యాడని, పవిత్ర సడెన్ గా చనిపోవడంతో.. డిప్రెషన్ లో ఉన్నాడని, మూడు రోజుల క్రితం చేయి కోసుకున్నాడని, పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టాడని, శుక్రవారం నుంచి ఇంట్లో వాళ్ల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్ కి మాకు తెలిసిన వాళ్ళని పంపించామని, అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే.. సూసైడ్ చేసుకొని ఉన్నాడని శిల్ప కన్నీళ్లు పెట్టుకున్నారు.

చందు తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ, పవిత్ర తో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పిల్లల్ని వదిలేశాడని, గత ఐదేళ్లుగా చందు ఇంటికి రాలేదని, పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళాడన్నారు. మూడురోజుల క్రితం తమ ఇంటికి వచ్చాడని, పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పాడని, అలా చేసుకోవద్దని చెప్పామని, శుక్రవారం పొద్దున లకడికపూల్ వెళ్లి వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com