Thursday, May 29, 2025

‘కన్నప్ప’కు బిగ్‌ షాక్‌

ప్రముఖ నటుడు మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన హార్డ్‌ డ్రైవ్‌ చోరీకి గురైంది. దీనిపై యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మూవీ కన్నప్ప. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 27వ తేదీన విడుదల కావాల్సి ఉంది. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, దేవరాజ్.. వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ దాదాపుగా పూర్తయిన సమయంలో హార్డ్ డిస్క్ మాయం కావడం కలకలం రేపింది. దీనిపై సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచారు. కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలకు వీఎఫ్ఎక్స్ ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ డిజైన్ చేసింది. ఈ విజువల్స్ పొందుపరిచిన హార్డ్ డ్రైవ్ ను కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర లో గల 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది. ఈ నెల 25వ తేదీన ఆ కొరియర్ 24 ఫ్రేమ్స్ ఆఫీస్ కు చేరగా.. అక్కడ పని చేసే ఆఫీస్‌ బాయ్‌ రఘు అందుకున్నాడు. ఈ విషయాన్ని అతను తనకు గానీ, అక్కడ ఉండే ఇతర సిబ్బందికి గానీ చెప్పలేదని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ హార్డ్ డ్రైవ్ ను ఆఫీస్ లో పని చేసే మహిళకు ఇచ్చాడని, అప్పటి నుంచి ఇద్దరూ కనిపించట్లేదని అందులో వివరించారు. సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో రఘు, ఆ మహిళ ఈ కుట్రకు పాల్పడినట్లు విజయ్‌ కుమార్‌ తన ఫిర్యాదులో ఆరోపించారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com