గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా “కన్యాకుమారి”. ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాతగా సృజన్ అట్టాడ రూపొందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “కన్యాకుమారి” సినిమా నుంచి ‘యద యద సవ్వడి..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘యద యద సవ్వడి..’ సాంగ్ కు సృజన్ అట్టాడ లిరిక్స్ అందించగా..అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం పాడారు. రవి నిడమర్తి బ్యూటిఫుల్ గా ట్యూన్ చేశారు. ‘యద యద సవ్వడి, చేసెను సందడి, నువ్వు నన్ను తాకగా, రేగెను అలజడి, అట్ట అట్ట సూడకే ఎట్ట ఎట్ట ఆపనే, పొంగుతున్న ప్రేమనే.. పిల్లా’ అంటూ సాగుతుందీ పాట. “కన్యాకుమారి” సినిమా నుంచి ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.