బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జొహర్ తెలియనివారుండరు. ప్రస్తుతం ఆయన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పిక్‌ని చూసి ఆయన అభిమానులంతా కూడా ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారు. స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకునే ఈ టాప్ ప్రొడ్యూసర్ ఈ ఫొటోలో గుండుతో బక్కచిక్కిపోయి కనిపిస్తున్నారు. దీంతో తన అభిమానులు కంగారు పడుతున్నారు. కరణ్‌కు ఏమయినా ఆరోగ్య సమస్యలు వచ్చాయా లేదా ఏదైనా మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇలా చేస్తున్నారా అని తెలియాల్సి ఉంది.