Monday, March 10, 2025

కర్ణాటక కాషాయ దళపతి గాలి..?

కర్ణాటక బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా గాలి జనార్ధన్ రెడ్డి నియామకం కానున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా బెంగళూరు పర్యటన సందర్భంగా వీరిద్దరి మధ్య ప్రధాన చర్చలు జరిగాయని పార్టీ వర్గాల్లో టాక్. బెంగళూరుకు వచ్చిన అమిత్‌ షా.. కేవలం జనార్ధన్ రెడ్డితో మాత్రమే చర్చించారని, పార్టీలోని మరెవరినీ అనుమతించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గతంలో గాలి జనార్ధన్‌రెడ్డి బీజేపీలో ఉండగా.. మొన్నటి ఎన్నికల్లో బయటకు వచ్చి సొంతంగా పార్టీ బ్యానర్‌పై పోటీ చేశారు. అయితే, అక్కడ బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతుండటంతో.. గాలి జనార్దన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com