- డీకే వంద కోట్లు ఆఫర్ చేశాడు
- ప్రజ్వల్ కేసులో దేవరాజే ఆరోపణలు
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు లీకైన కేసులో.. అడ్వకేట్ జీ దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు నలుగురు మంత్రుల పాత్ర ఈ కేసులో ఉన్నట్లు ఆయన ఆరోపించారు. హసన్ జిల్లా ప్రిజన్స్‌కు తీసుకెళ్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజ్వల్ రేవణ్ణ కేసులో హెచ్‌డీ కుమారస్వామి పేరును ఇరికించేందుకు డీకే శివకుమార్ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. కుమారస్వామిపై ఆరోపణలు చేస్తే తనకు వంద కోట్లు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం సిద్దమైనట్లు దేవరాజే గౌడ ఆరోపించారు.
ప్రజ్వల్ వీడియోలు లీకేజీ వెనుక కుమారస్వామి ఉన్నట్లు చెప్పేందుకు తనకు డీకే వంద కోట్లు ఆఫర్ చేశాడని, మంత్రులు చాలువరయస్వామి, కృష్ణ బైర గౌడ, ప్రియాంక్ ఖర్గేతో పాటు మరికొంత మంది ఆ ఆఫర్ చేసినట్లు దేవరాజే గౌడ తెలిపారు. తనకు అడ్వాన్స్‌గా బౌరింగ్ క్లబ్‌కు అయిదు కోట్లు ఆఫర్ చేసినట్లు వెల్లడించాడు. కానీ దానికి తాను అంగీకరించలేదన్నారు.
అందుకే కుట్ర పన్ని తనను ఇరికించినట్లు గౌడ ఆరోపించారు. మోదీకి, బీజేపీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో డీకే శివకుమార్ ఈ ప్లాన్ వేసినట్లు గౌడ ఆరోపించారు. తనపై లైంగిక వేధింపులు, రేప్ కేసు నమోదు చేశారని, కానీ ఏ ఆధారాలు చిక్కలేదని, ఇప్పుడు పెన్ డ్రైవ్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గౌడ తెలిపారు.