హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని ప్రజెంట్ చేసింది ఈ సినిమా ఫస్ట్ లుక్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.
ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్నారు. సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకు కమ్ బ్యాక్ ఇస్తూ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ కాగ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.