Thursday, May 8, 2025

సిట్టింగ్​ అవుట్​..! చేవెళ్లలో కాసాని.. వరంగల్​కు కావ్య

రెండు స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థులు ఖరారు

టీఎస్​ న్యూస్​:
వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పేర్లను ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా కేసీఆర్‌ అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా తొలి జాబితాలో బీఆర్‌ఎస్‌ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇప్పటికే ఖరారుచేశారు.

సిట్టింగ్​ అవుట్​
కాగా, చేవెళ్ల పార్లమెంట్​ సెగ్మెంట్​లో ప్రస్తుతం బీఆర్ఎస్​ పార్టీ నుంచి ఎంపీ రంజిత్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఇటీవల రాజకీయ పరిణామాల్లో ఆయన ఇక్కడి నుంచి బీఆర్​ఎస్​ తరుపున పోటీ చేసేందుకు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పార్టీ అభ్యర్థి మార్పు అనివార్యమైంది. చేవెళ్ల స్థానాన్ని అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్​ ముదిరాజ్​ను కేసీఆర్​ ప్రకటించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com