Monday, March 10, 2025

కథ వినేందుకు ఒంటరిగా రమ్మన్నారు

టాలీవుడ్‌..బాలీవుడ్‌.. హాలీవుడ్‌.. ఇలా ఏ ఇండసట్రీలోనైనా సరే రాణించాలంటే అంత తేలికైన పనేమా కాదు. అందులోనూ ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే మాములు విషయం కాదు. ఇక హీరోయిన్ల పరిస్థితైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా దారుణంగా ఉంటుంది. ఆఖరికి గ్లోబల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంకకి కూడా ఇలాంటి పరిస్థితులు తప్పలేదు.
ఈ విషయాన్ని ప్రియాంక తల్లే స్వయంగా తెలిపింది. కెరీర్‌ మొదలు పెట్టిన స్టార్టింగ్‌లో కూతురిని కంటికి రెప్పలా కాపాడుకున్నామని, సెట్స్‌లో తాను ఓ దెయ్యంలా కూర్చునేదాన్నని వెల్లడించారు. ప్రియాంక కూడా మానసికంగా చాలా దృఢంగా ఉండేదని, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో తనే ధైర్యంగా నిర్ణయం తీసుకుందని అన్నారు.
కెరీర్‌ స్టార్టింగ్‌లో ఓ దర్శకుడు కథ చెబుతానని ప్రియాంక తల్లిని కారవాన్‌ నుంచి బయటకు వెళ్ళమన్నారట. ప్రియాంకకు ఒంటరిగా కథ చెబుతానని చెప్పారట. ప్రియాంక ఎంతో ధైర్యంగా తన తల్లి పక్కన లేకుండా మీరు కథ చెప్పలేకపోతే, సినిమా మొత్తం ఒంటరిగా ఎలా చేస్తానని అనుకున్నారని ఘాటుగా స్పందించింది.

 

 

 

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com