Friday, December 27, 2024

ఈటల దగ్గర రేవంత్​ రూ. 25 కోట్లు తీసుకున్నాడు

రాష్ట్రంలో మళ్లీ కౌశిక్​ రెడ్డి వ్యాఖ్యల హల్​చల్​

టీఎస్​, న్యూస్: ఈట‌ల రాజేంద‌ర్ పెద్ద మోస‌గాడు.. తాను సంపాదించుకున్న అక్ర‌మ ఆస్తుల‌ను కాపాడుకునేందుకే మ‌ల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్నాడ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించేందుకు ఆయ‌న వ‌ద్ద రేవంత్ రెడ్డి రూ. 25 కోట్లు తీసుకున్నాడ‌ని కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ స‌న్నాహ‌క స‌మావేశంలో పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

మ‌ల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ మోసాలు చెప్పేందుకే ఇక్క‌డ‌కు వ‌చ్చాను. మీ అంద‌రికి ఒక్క‌టే మాట చెబుతున్నా.. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో చెల్ల‌ని రూపాయి.. మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఎలా చెల్లుతుంద‌నేది ఆలోచించండి. 20 ఏండ్లు హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేయ‌లేదు. హుజురాబాద్ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిండు.. గ‌జ్వేల్ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిండు. అన్నం పెట్టిన కేసీఆర్‌ను మోసం చేసిండు. ఇవాళ మ‌ల్కాజ్‌గిరిలో మిమ్మల్ని మోసం చేయ‌డానికి వ‌స్తుండు త‌స్మాత్ జాగ్ర‌త్త అని కౌశిక్ రెడ్డి హెచ్చ‌రించారు.

రేవంత్ అమ్ముడుపోయే వ్య‌క్తి..

revanth reddy and padi kaushikగులాబీ శ్రేణుల‌కు కేసీఆర్, కేటీఆర్ అండ‌గా ఉంటారు. నా చేతులు జోడించి చెబుతున్నాను.. కొట్లాడుదాం. అధైర్య ప‌డొద్దు. రేవంత్ రెడ్డితో ఏం కాదు. రేవంత్ అమ్ముడుపోయే వ్య‌క్తి. పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఈ ఐదేండ్ల‌లో ఏనాడైనా ముఖం చూపించాడా..? ఒక‌సారి ఆలోచించండి. సునీత‌కు మ‌ల్కాజ్‌గిరితో ఏం సంబంధం. బీజేపీతోని కుమ్మ‌క్కై డ‌మ్మీ అభ్య‌ర్థి సునీత‌ను నిల‌బెట్టి ఈట‌ల‌ను గెలిపించేందుకు రేవంత్ ప్లాన్ చేశారు. సేమ్ హుజురాబాద్ బై ఎల‌క్ష‌న్స్‌లో ఏం చేసిండో.. మ‌ల్కాజ్‌గిరిలో అదే చేయ‌బోతుండు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌. ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఉప ఎన్నిక‌లో అభ్య‌ర్థిగా నేను ఉండాలి. కానీ ఇదే ఈట‌ల‌తో రూ. 25 కోట్లు తీసుకొని అమ్ముడు పోయాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఉంటూ బీజేపీ అభ్య‌ర్థి గెలుస్తాడ‌ని చెప్పారు. ఇక లాభం లేద‌ని చెప్పి నేను బీఆర్ఎస్‌లో చేరాను. డ‌మ్మీ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్‌ను పోటీలో పెడితే.. 2500 ఓట్లు వ‌చ్చాయి. ఈట‌ల గెలిచాడని గుర్తు చేశారు కౌశిక్ రెడ్డి.

మ‌ల్కాజ్‌గిరి వ‌చ్చి పోటీ చేయాల్సిన అవ‌స‌రం ఉందా..?
20 ఏండ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశావు క‌దా..? ఒక ఐదేండ్లు అధికారం లేకుండా ఉండ‌ లేక‌పోతున్నావా..? మ‌ల్కాజ్‌గిరి వ‌చ్చి పోటీ చేయాల్సిన అవ‌స‌రం ఉందా..? అంటే తాను సంపాదించుకున్న అక్ర‌మ సొమ్మును కాపాడుకునేందుకు బీజేపీ అభ్య‌ర్థిగా మ‌ల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్నాడు ఈట‌ల రాజేంద‌ర్. భూముల‌ను కాపాడుకోవాల‌ని వ‌చ్చాడు. ద‌యచేసి ఈ విష‌యాన్ని మ‌రిచ‌పోవ‌ద్దు అని కౌశిక్ రెడ్డి సూచించారు.

revanth reddy and padi kaushik

సిగ్గు లేకుండా దేవుడి గురించి మాట్లాడుతున్నాడు..
ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ.. దేవుడిని మొక్కుతా.. న‌మ్ముతా.. గుడి క‌ట్టాల‌ని చెబుతున్నారు. 20 ఏండ్ల‌లో ఏ ఒక్క‌నాడు కూడా బొట్టు పెట్టుకోలేదు రాజేంద‌ర్. సిగ్గు లేకుండా ఇవాళ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఆయ‌న‌కు ఇంగ్లీష్, హిందీలో మాట్లాడ‌టం రాదు. కాంగ్రెస్ అభ్య‌ర్థి సునీతా మ‌హేంద‌ర్ రెడ్డికి కూడా ఇంగ్లీష్, హిందీలో మాట్లాడ‌టం రాదు. మ‌రి వీరు పార్ల‌మెంట్‌లో ఏం మాట్లాడుతారు. అదే రాగిడి ల‌క్ష్మారెడ్డికి ఇంగ్లీష్, హిందీలో అద్భుతంగా మాట్లాడుతారు.. ప‌క్కా లోకల్ వ్య‌క్తి అయిన‌ అత‌ను మీ గొంతుక‌గా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతారు. కాబ‌ట్టి ఆలోచించి ఓటు వేయాల‌ని కౌశిక్ రెడ్డి కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com