Tuesday, March 11, 2025

కౌశిక్ రెడ్డి ఒక సూసైడ్ స్టార్

మీడియాలో కనిపించడానికి ఆయన ఇష్టం వచిన్నట్లు మాట్లాడుతున్నారు
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

కౌశిక్ రెడ్డి ఒక సూసైడ్ స్టార్ అని, మీడియాలో కనిపించడానికి ఆయన ఇష్టం వచిన్నట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ప్రజలు డబుల్ బెడ్ రూం ఇళ్లు అడిగినప్పుడు అక్రంగా కేసులు పెట్టించినప్పుడు ఏమయ్యిందని ఆయన ప్రశ్నించారు. ఒక మహిళా అధికారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మర్చిపోయావా అని ఆయన ప్రశ్నించారు.

ఒక సర్పంచ్ కుటుంబంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.20 లక్షలు తీసుకొని ఉద్యోగం పెట్టించలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఆ 20 లక్షలు తిరిగి అడిగితే కేసు పెట్టించింది ఎవరో మర్చిపోయావా అని ఆయన ప్రశ్నించారు. తాను పుట్టిందే బిఆర్‌ఎస్‌లోనని, బిఆర్‌ఎస్ కోసమే పుట్టినట్లు మాట్లాడానికి సిగ్గు లేదా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడానికి సిగ్గు ఉండాలని ఆయన ఆరోపించారు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టిడిపి నుంచి బిఆర్‌ఎస్‌లోకి తీసుకొని మంత్రి ఇచ్చారని దీనికి ఎవరూ సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com