Saturday, February 22, 2025

రేవంత్‌ రెడ్డి కామెంట్లకు కవిత స్ట్రాంగ్‌ కౌంటర్‌

సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదని ఎమ్‌ఎల్‌సి కవిత మండిపడ్డారు. తన గురించి మాట్లాడవద్దని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు ఆమె ఆగ్రహం చెందారు. ఈ రోజు నిజామాబాద్ లోని పసుపు మార్కెట్ యార్డును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… సుప్రీం కోర్టు తిట్టిన మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ ఖర్మ అని అన్నారు. అయినా విజ్ఞత లేకుండా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని..నేను ఆయనలా మాట్లాడి నా స్థాయిని తగ్గించదలుచుకోవడం లేదని అన్నారు. నోరుందికదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అనంతరం ఆమె పసుపు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడుతామని చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత… ఆయన ప్రకటన చేశారని అన్నారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను తరలించడానికి ఏపీ ప్రాజెక్టు చేపడుతున్నారు.. మన దగ్గరి నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి చూస్తూ నిలబడ్డారని ఎద్దేవ చేశారు. బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలో ఉందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాబట్టి వాళ్లిద్దరు ఎలా చెబితే సీఎం రేవంత్ రెడ్డి అలా నడుచుకుంటున్నారని అన్నారు. నిజంగా తెలంగాణహితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని అన్నారు. ప్రభుత్వం కోర్టుల్లో ఎందుకు కేసులు వేయడం లేదని అన్నారు. ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే, కాలువలు విస్తరిస్తే కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారు.
తెలంగాణ రైతుల కంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రేమ చంద్రబాబుపై ఉందా అని అన్నారు. రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలు ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కవిత డిమాండ్‌ చేశారు.

పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదని..దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయని అన్నారు. దాని వల్ల స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుందన్నారు.
వ్యాపారులంతా సిండికేట్ గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని ఆవేదని వ్యక్తం చేశారు. నాలుగైదు రోజులు వేచిచూసినా పసుపు కొనడం లేదు.. ఒక రకంగా రైతును బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. పసుపుకు 12 వేల కనీస ధర కల్పిస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని అన్నారు. అంతకు తక్కువ ధర ఉంటే మిగితా డబ్బును బోనస్ రూపంలో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలియజేశారు. తక్షణమే పసుపుకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com