టీఎస్, న్యూస్. : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ఆదివారంతో ముగిసింది. దీంతో ఆమెను సోమవారం ఉదయం రౌస్ అవెన్యూ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పర్చనున్నారు.
కాగా సీబీఐ అధికారులు కవిత కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించమని అడిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. కవిత పక్షాన న్యాయవాదాలు బెయిల్ కోసం తీవ్ర స్థాయిలో యత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ వస్తుందా? రాదా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.