బీఆర్ఎస్ నాయకులు ఊహించినట్లే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా గంటన్నరట పాటు వాదానలు జరిగాయి. దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ ఎస్వీ రాజు, కవిత తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కవిత బెయిల్ కు అర్హురాలన్న రోహత్గీ వాదనలు వాదనలతో ఏకీభవించిన అత్యున్నత ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.
మార్చి 15న లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈక్రమంలో ఆమె పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ సారి కవిత తరుపు లాయర్ రోహత్గీ బలంగా తన వాదానలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూ.100 కోట్లు చేతులు మారాయన్నది ఆరోపణ మాత్రమే. కేసులో 493 మంది సాక్షులను విచారించారు. కవిత ఎవరినీ బెదిరించలేదు. ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది అంటూ తన వాదానలు వినిపించారు.
దీంతో రోహత్గీ వాదనలు వాదనలతో ఏకీభవించి సుప్రీం కవితకు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదు నెలల పాటు తీహార్ జైల్లోనే ఉన్న కవితకు బెయిల్ రావడంతో జైలు ఫార్మలిటిస్ కంప్లీట్అయ్యాక విడుదల కానున్నారు. కోర్టు తీర్పు పత్రాలను ఆమె తరుపు లాయర్లు జైలు అధికారులకు వెంటనే అందించనునున్నారు. ఆమె ఈ రోజు సాయంత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు.