Tuesday, May 13, 2025

కవితకు కస్టడీ

టీఎస్​, న్యూస్​:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరగా.. 7 రోజుల పాటు కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే.. వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతించడం జరిగింది. కాగా.. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఐటీ, ఈడీ జాయింట్ సోదాలు నిర్వహించిన అనంతరం.. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా పైవిధంగా కోర్టు తీర్పును వెలువరించింది.

ఏం జరుగుతుంది..?
ఇదిలా ఉంటే.. తనపై చర్యలు తీసుకోవద్దన్న కవిత పిటిషన్‌ సుప్రీంకోర్టులో మంగళవారం (మార్చి-19న) నాడు విచారణకు రానుంది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. ఇప్పటికే పలుమార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు.. ఈ కస్టడీలో ఏమేం అడగబోతున్నారు..? ఎలాంటి సమాచారం రాబడుతారు..? అని బీఆర్ఎస్‌లో ఒకింత టెన్షన్ మొదలైంది. కస్టడీ తర్వాత ఏం జరగబోతోంది..? అంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి, కవిత సోదరుడు కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి.. దీనిపై ఎలా ముందుకెళ్లాలని సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com