-
కవితకు లభించని ఊరట
-
వచ్చే నెల 3 వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న ఎంఎల్ సి కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె జ్యూడీషియల్ రిమాండ్ ను కోర్టు పొడగించింది. వచ్చే నెల మూడవ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వుులు జారీ చేసింది.
నేటితో రిమాండ్ గడువు ముగియడంతో తీహార్ జైలు అధికారులు సోమవారం కవితను వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెకు సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ తుది తీర్పు వెల్లడించారు.