Thursday, May 29, 2025

కవిత కొత్త కుంపటి సింగ‌రేణి జాగృతి ఆవిర్భావం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నేతృత్వంలో సింగ‌రేణి జాగృతి ఆవిర్భావించింది. ఇవాళ త‌న నివాసంలో సింగ‌రేణి కార్మికుల‌తో క‌విత స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌న్నారు. టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామ‌న్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం అని క‌విత స్ప‌ష్టం చేశారు. సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటైంద‌న్నారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం. కేసీఆర్ నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని.. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కోసం పని చేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదు. అలియాస్ నేమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని క‌విత డిమాండ్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com