Wednesday, April 30, 2025

కవ్విస్తున్న పాక్‌.. హెచ్చరిస్తున్న భారత్ యుద్ధం తప్పదా..?

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం జరిగిన ఉగ్రదాడి రెండు దేశాల మధ్య నిప్పు రాజేసింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ గుర్తించింది. దీంతో పాకిస్థాన్‌‌కి వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. అందులోభాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాక్ సైతం అదే రీతిలో స్పందించి.. భారత్‌తో గతంలో చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని సైతం రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారాయి. తప్పు తనదే అయినా.. ఏ మాత్రం భయపడకుండా భారత్‌ యుద్దానికి సిద్ధమంటూ పాక్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఇదే అంశంపై తాజాగా పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తౌల్లా తరార్ స్పందించారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ భారత్‌పై మండిపడ్డారు. తమ జోలికి వస్తే అంతు చూస్తామంటూ భారత్‌ను ఆయన హెచ్చరించారు. మరో 24 లేదా 36 గంటల్లో తమపై యుద్ధానికి భారత్ సిద్దమవుతోందని చెప్పారు. ఇక ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అయితే.. ఈ ఉగ్రవాద చర్యలకు బాధ్యులం తామేనన్నారు. అందుకు కారణాన్ని సైతం ఆయన వివరించారు. అలాంటి వేళ ఏ మాత్రం ఆ దేశం వెనక్కి తగ్గకుండా.. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతోంది. తాజాగా మరోసారి సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద.. బుధవారం భారత్‌ భూభాగంగాపైకి మరోసారి కాల్పులు జరుపుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని నౌషారా, సుందర్బనీ, అక్నూర్ సెక్టార్లలో ఈ కాల్పులు జరుపుతోంది. అలాగే రాకెట్ లాంచర్లను ప్రయోగిస్తోంది. ఇక బారాముల్లా, కుప్వారా జిల్లాలో సైతం దాదాపుగా ఇదే పరిస్థితి నెలకుంది. గత అయిదు రోజులుగా పాక్ ఇదే తీరుగా భారత సరిహద్దులపై కాల్పులకు దిగుతోంది. అయితే ఈ కాల్పును ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతోన్న సంగతి తెలిసిందే.
మరోవైపు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలకు ఫుల్ స్టాప్ పేట్టేందుకు భారత్ ఒక్క అడుగు ముందుకు వేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అదీకాక పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపే అవకాశముందని పాక్ భావించింది. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రమూకలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం విధితమే. కానీ పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడిన భారత్ మాత్రం.. సంయమనం పాటిస్తూ వస్తోంది. భారత్ సహనాన్ని మరింత రెచ్చగొడితే మాత్రం పాక్‌పై భారత్ యుద్దభేరి మోగించడం ఖాయమన్నది.. గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com