ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణిని ఆశ్రయించారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు పలు జంక్షన్లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వాధికారులను టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ పార్టీ నేత చంద్రశేఖర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ మహానగరంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వాధికారులను టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ పార్టీ నేత చంద్రశేఖర్ రెడ్డి కోరారు. అందులోభాగంగా సోమవారం గ్రీన్ లాండ్స్‌లోని మహాత్మ జ్యోతి రావు పూలే భవనంలో నిర్వహిస్తున్నప్రజావాణికి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ రహదారి విస్తరణలో భాగంగా తన ప్లాట్‌లో ఓ వైపు 20 అడుగులు, మరో వైపు 36 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆయన కోరారు. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో కీలక నిర్ణయం తీసుకొంది. అందుకోసం రూ. 1,100 కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలోని రహదారులన్నీ నిత్యం ట్రాఫిక్‌తో సతమతమవుతోన్నాయి. ఈ ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు నగరంలోని వివిధ కీలక ప్రాంతాల్లో జంక్షన్లు అభివృద్ధికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా తొలి దశలో కేబీఆర్ పార్క్ చుట్టూ 6 కూడళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్‌మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ ప్రాజెక్టులో భాగంగా రూ.826 కోట్లతో జంక్షన్ల డిజైన్లకు రేవంత్ సర్కార్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఓ వైపు అండర్ పాస్‌లు, మరో వైపు ఫ్లై ఓవర్లు నిర్మించబోతున్నారు. తొలి దశలో రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. రెండో దశలో రూ.405 కోట్లతో రోడ్ నెంబర్-45 జంక్షన్, ఫిల్మ్‌నగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్‌లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. జూబ్లీహిల్స్. ఆ ప్రాంతంలో ఎటు వైపు వెళ్లాలన్న గంటల కొద్ది సమయం పడుతుంది. ఈ క్రమంలో కేబీఆర్ పార్క్‌ను కేంద్రంగా చేసుకొని చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేస్తూ అన్ని వైపులా సులువుగా ప్రయాణించేలా ప్రణాళికలు రూపొందించారు. వాటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలతో పాటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి.. పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఈ నేపథ్యంలో పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించే క్రమంలో పలువురి స్థలాల మీదగా వీటిని నిర్మించాల్సి వస్తోంది. దీంతో సదరు స్థలాల యజమానులు ముందుగా స్పందిస్తున్నారు. ఆ క్రమంలోనే అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.