బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీష్ రావు కలిసి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసులను కొట్టివాయాలని వారు కోరారు. మేడిగడ్డ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని, దీనివలన ప్రజాధనం వృధా అయ్యిందని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు ఈ ఏడాది జూలై 10న కేసీఆర్, హరీష్ రావు సహా ఆరుగురు వ్యక్తులకు నోటీసులను పంపించింది. అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు తాజాగా పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.