-
తొలి జాబితాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నిల్
-
నాలుగు లోక్ సభ స్థానాలను అభ్యర్ధుల ప్రకటన
టీఎస్, న్యూస్ : పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్…..మొదటి జాబితాను ప్రకటించారు.ఇందులో నలుగురికి చోటు కల్పించారు. సిట్టింగ్ ఎంపీలు ఒక్కరొక్కరుగా పార్టీనీ వీడుతుండడంతో వీటిని అడ్డుకట్టు వేసేందుకు కేసీఆర్ వెంటనే రంగం ప్రవేశం చేశారు. ఇందులో భాహంగా ఆదివారం నుంచి తెలంగాణ భవన్ కు వస్తున్న ఆయన రెండు రోజులుగా పలు లోక్ సభ నియోజకవర్గం నేతలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకుంటూనే అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. ఆదివారం కరీంనగర్, పెద్దపేట్ లోక్ సభ నియోజకవర్గం నేతలతో సమావేశమైన కేసీఆర్ సోమవారం ఖమ్మం, మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్దులను కేసీఆర్ ప్రకటించారు.
కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం పార్టీ సీనియర్ నాయకుడు బి. వినోద్ కుమార్ కు దక్కగా.పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ, పార్టీ ఫ్లోర్ లీడర్
నామ నాగేశ్వర్ రావులకు అవకాశమిచ్చారు. అలాగే మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను పార్టీ అభ్యర్ధిగా కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి నామా నాగేశ్వర్ రావు త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇక మాలత్ కవితికు కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చినప్పటికీ….ఆమె మాత్రం పోటీకి దూరంగా ఉంటారన్న ప్రచారం సాగింది. కానీ 24 గంటలు తిరక్కుముందు వారినే అభ్యర్ధులుగా కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు.