Wednesday, April 2, 2025

కేసుల్లో సేమ్​ అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు కేసీఆర్​

టీఎస్​, న్యూస్​: ఒక‌ప్పుడు ఓటుకు నోటు కేసు అంటూ బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన హడావుడి తెలిసిందే. ఇప్పుడు అలాంటి కేసు కేసీఆర్‌ మెడ‌కు చుట్టుకోబోతున్నట్లు స్పష్టమవుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. అప్పట్లో చంద్రబాబును దేవుడు కూడా కాపాడ‌లేడ‌ని చెప్పి కేసీఆర్‌కు.. ఇప్పుడు కేసీఆర్​కు అదే పరిస్థితి వచ్చినట్లుగా మారింది. కొద్ది రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ వ్యవ‌హారం వెలుగులోకి రావ‌డం, ఎప్పటిలాగే కొన్నిరోజులు ఈ అంశంపై హ‌డావుడి చేసి, తరువాత ప్రభుత్వం మ‌ర్చిపోతుంద‌ని భావించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవ‌హారాన్ని తేలిగ్గా తీసుకొనే ప‌రిస్థితి కనిపించడం లేదు. ఇదే సమయంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు రాధాకిషన్​రావు ఒప్పుకున్నారు. ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు రేవంత్ సైతం ప‌లుసార్లు ఈ అంశాన్ని లేవ‌నెత్తిన‌ప్పటికీ ఉప‌యోగం లేకుండా పోయింది.

రేవంత్ సీఎం అయిన త‌రువాత.. హోంశాఖను త‌న‌వ‌ద్దే ఉంచుకోవ‌టానికి ప్రధాన కార‌ణం పోలీస్ శాఖ‌ను సెట్‌రైట్ చేసే బాధ్యత‌ను తీసుకోవాలనుకోవడమే కాకుండా.. ఈ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం కూడా అన్నట్లుగామారింది. అధికారంలో ఉండగా కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఫోన్ ట్యాపింగ్ ను వజ్రాయుధంలా వాడుకున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉండ‌టంతో.. ఆ వ‌జ్రాయుధాన్ని తిరిగి వాళ్ళ మీదకే ప్రయోగించడానికి రేవంత్ ప‌క్కాప్లాన్‌తో ఉన్నట్లు వెల్లడవుతున్నది. బీఆర్ఎస్ హ‌యాంలో రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. బీజేపీ నేత‌ల వ్యవ‌హారంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన‌ట్లు వెల్లడైంది. బీఆర్ఎస్ హ‌యాంలో ఫామ్ హౌస్ లో ప్రముఖ బీజేపీ నాయకులను డబ్బుతో పట్టుకొన్నామ‌ని కేసీఆర్ తెగ హంగామా చేసిన విష‌యం తెలిసిందే.

దేశంలో అన్ని రాష్ట్రాల నాయకులకు, న్యాయమూర్తులకు లేఖ‌లు రాసి బీజేపీ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేస్తే తాను పట్టుకొన్నామ‌ని అప్పట్లో కేసీఆర్ హ‌డావుడి చేశారు. అంతేకాదు ప్రధాని మోడీని నానా విధాలుగా దుర్భాష‌లాడారు. ఆ దెబ్బతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారి దేశానికే ప్రధాని అవుతాన‌ని కేసీఆర్ క‌ల‌లు క‌న్నారు. కానీ, కేసీఆర్ ను దేశంలో ఎవ్వరూ నమ్మలేదు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యత‌లు చేప‌ట్టి నాటినుంచి సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టి కేసీఆర్ పునాదులు ఇప్పుడు కదులుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం వెలుగులోకి రావడం, అందులో కేసీఆర్​ ప్రమేయం తేలుతుండటంతో బీఆర్ఎస్ నేత‌లు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం చాపకింద నీరులా తన పనితాను చేసుకొంటూ పోతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com