Monday, January 27, 2025

కేసీఆర్‌ ఎమోషనల్‌ అక్కకు నివాళి

బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం మునిరాబాద్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. సోదరి పార్థివదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. అంతిమయాత్రలో కేసీఆర్‌ తో పాటు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌ రావు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా, కేసీఆర్‌కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. భర్త హన్మంతరావు కొన్నేండ్ల క్రితమే మృతిచెందారు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com