Saturday, May 17, 2025

అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్

  • అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్
  • ఓటమి తరువాత తొలిసారి సభకు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. మొదటిరోజు శాసనసభ సమావేశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలపనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తీర్మాణం ప్రవేశపెట్టనున్నారు.

ఈ నెల 25న డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 27 నుంచి బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. కేసీఆర్ ఈనెల 27 నుంచి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ పై చర్చలో కేసీఆర్ పాల్గొననున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన కమీషన్లపై కూడా అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ రెండు అంశాలకు సంబందించిన చర్చలోను కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com