Tuesday, April 29, 2025

కేసీఆర్‌ది అంతా అక్కసే ఖజానా లూటీ చేసి ఇంకా మాటలా.. ? : సీఎం రేవంత్

ఎల్కతుర్తి సభలో కేసీఆర్ అంతా అక్కసే వెళ్లగక్కారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రేవంత్ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కేసీఆర్ ఖజానాను లూటీ చేసి పోయి ఇప్పుడు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. తాను ఇంకా ఇరవై ఏండ్లు రాజకీయాల్లో ఉంటానని రేవంత్ నమ్మకం వ్యక్తం చేశారు. ప్రజలు పదేళ్లు చాన్స్ ఇస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావులను పిల్లగాళ్ళు అని కేసీఆర్ అన్నాడు. మరి వారినేందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడని ప్రశ్నించారు. సంవత్సరంన్నర నుండి పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటంన్నింటిని స్ర్టీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. తాను చట్టప్రకారమే నడుచుకుంటానని..అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని అరెస్ట్ చేయించలేనని స్పష్టం చేశారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డామని. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామని తెలిపారు. కొంత మంది అధికారుల తీరు గురించి తనకు తెలుసని అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగించాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ మాటల్లో స్పష్టత లేదని.. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ పూర్తిగా ఖాళీ చేసి, ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని రేవంత్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, తనకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో తనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్పష్టం చేశారు.అవసరాలకు అనుగుణంగా కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ తమ వైఖరిని మార్చుకుంటున్నారని విమర్శించారు. దేశానికి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ లాంటి నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు చివరి 6 నెలలు నా పాలనపై చర్చ జరుగుతుందని వ్యాఖ్యానించారు. నక్సలైటన్లను ఏరివేసే ఆపరేషన్ కగార్ అంశం పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని రేవంత్ అన్నారు. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు. నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను. ఇప్పించానన్నారు. అయితే కొంత మంది కాంగ్రెస్ నేతలు దారి తప్పుతున్నారని అన్నారు. పదవుల కోసం బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడితే పదవులు రావన్నారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారని.. ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదని స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలో అందర్ని అప్రమత్తం చేస్తున్నా మార్పు రావడం లేదన్నారు. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని, వారు వెళితేనే పథకాలు ప్రజల్లోకి వెళతాయని అన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారని హెచ్చరించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com