Monday, February 3, 2025

కేటీఆర్​ను సీఎం చేసేందుకు మోడీ దగ్గరకు వెళ్లలేదా

టీఎస్​ న్యూస్​: కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ స్నేహాంపై అసెంబ్లీలో శుక్రవారం రేవంత్‌ మాట్లాడుతూ కేసీఆర్ సొంత పార్టీ నేతలకు కూడా ముఖ్యమైన విషయాలు చెప్పరన్నారు. బీఆర్ఎస్ నేతలకు అనుమానం ఉంటే.. తన దగ్గరకు వచ్చి కలిస్తే అన్ని వివరిస్తానని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కొంత మంది మంత్రులు అవిశ్వాసం ప్రకటించి.. కేటీఆర్‌ను సీఎం చేయాలని చూశారన్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక కేసీఆర్ మోదీ దగ్గరకు వెళ్లి కేటీఆర్‌ను సీఎం చేస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరారని తెలిపారు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు. మోదీ తీసుకువచ్చిన చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com